వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేయను.. కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

Published : Nov 16, 2020, 02:33 PM IST
వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేయను.. కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

సారాంశం

ఎల్లోమీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వెన్నుపోటుకు మారుపేరైన బాబు మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే తాను ఉరివేసుకుంటానని మంత్రి కొడాలి నాని.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సవాలు విసిరారు. మార్కెట్ యార్డులో టిక్కడో లబ్దిదారులతో సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. మార్కెట్ యార్డు నుంచి మల్లాయి పాలెం టిడ్కో ఇళ్ల సముదాయాల వరకు మంత్రి కొడాలి నాని ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  తాను గుడివాడలో 17వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇస్తానని చెప్పారు. మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని హామీ ఇచ్చారు. అలా చేయని పక్షంలో తాను వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేయనని ఆయన పేర్కొన్నారు. తనపై కావాలనే టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎల్లోమీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వెన్నుపోటుకు మారుపేరైన బాబు మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.  టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని, వాస్తవ పరిస్థితులను ప్రజల కళ్లకు కట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

‘గుడివాడ గడ్డపై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇక్కడ ఇళ్ళు లేని పేదలు ఎంతో మంది ఉన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు హడావుడిగా శంఖుస్థాపన చేశారు. అంతేతప్ప వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. చిన్న వర్షం కురిస్తే చాలు.. ఇళ్ల సముదాయాల వరకు వెళ్ళలేని దుస్థితి. అందుకే అర్హులందరికీ లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో ఇళ్ల స్థలాల కోసం 94 కోట్ల తో 181 ఎకరాలు తీసుకున్నాం. 8 వేల మందికి సెంటు స్టలం ఇస్తాము. టిడ్కో లబ్ధిదారుల దగ్గర డబ్బులు బాబు కట్టించుకున్నారు. వాటిని వేరే అవసరాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు.

చంద్రబాబు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇళ్ళు ఇవ్వకపోగా శకునిలా అన్నింటికీ అడ్డుపడుతున్నారు. బాబు అండ్‌ కో బ్యాచ్‌కి కులగజ్జి పట్టుకుంది. తమ కులస్తుడు చంద్రబాబే ముఖ్యమంత్రి ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. ఇతర కులస్తులు ముఖ్యమంత్రిగా  ఉంటే ఓర్వలేక పోతున్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్రలు చేస్తున్నారు. డబ్బా ఛానెల్స్ లో పనికిమాలిన చర్చలు పెడుతున్నారు. పచ్చమీడియాలో పిచ్చి రాతలు రాయించి జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. నాకు వ్యాపారాలు లేవు. నేను బతికున్నంత వరకు ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తాను. 2024 ఎన్నికల నాటికి ఇళ్ళు ఇవ్వకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను’’ అని కొడాలి నాని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu
Chandrababu Naidu Interacts with School Students | Chandrababu Visit Schools | Asianet News Telugu