ప్రియుడితో రాసలీలలు.. భర్త అడ్డుగా ఉన్నాడని..

Published : Nov 16, 2020, 01:58 PM IST
ప్రియుడితో రాసలీలలు.. భర్త అడ్డుగా ఉన్నాడని..

సారాంశం

సమీప బంధువు పెంచలయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను పలుమార్లు మందలించాడు. ప్రవర్తన మార్చుకోవాలని నచ్చచెప్పాడు. కానీ.. ఆమె మాత్రం మారలేదు.

 
ప్రియుడితో రాసలీలలకు భర్త అడ్డుగా ఉన్నాడని ఓ  మహిళ కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. ప్రియుడి సహాయంతో.. భర్తను హత్య చేసి తనకు ఏమీ ఎరగనట్లు నటించింది. కాగా.. పోలీసుల దర్యాప్తులో ఆమె గుట్టు రట్టుకావడంతో నేరం అంగీకరించింది. ఈ సంఘటన ఆత్మకూరులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆత్మకూరు మండలం దేపూరు ఎస్సీ కాలనీకి చెందిన కటారి వెంకటేశ్వర్లు(37) వెంకట సుబ్బమ్మ దంపతులు. మేకలు కాచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. గత కొంతకాలంగా వెంకట సుబ్బమ్మ తన సమీప బంధువు పెంచలయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను పలుమార్లు మందలించాడు. ప్రవర్తన మార్చుకోవాలని నచ్చచెప్పాడు. కానీ.. ఆమె మాత్రం మారలేదు.


తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య కడతేర్చేందుకు ప్రణాళిక వేసింది. ఈ నెల 9న వెంకటేశ్వర్లు జీవాలకు మేత కోసం పొలాల్లోకి వెళుతుండగా గమనించి ప్రియుడితో కలిసి తోట దారి వద్ద తలపై దాడి చేయడంతో  అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తరువాత ఎలాంటి అనుమానం రాకుండా నిందితులు గ్రామానికి చేరుకున్నారు.

 ఈ నెల 11న గ్రామస్తులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిజాలు వెలుగు చూడడంతో నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu