మహారాష్ట్రలో చిన్నారుల కిడ్నాప్.. ఏపీలో విక్రయం: కిడ్నాప్ ముఠా గుట్టురట్టు , బెజవాడ మహిళ అరెస్ట్

Siva Kodati |  
Published : Mar 08, 2023, 03:09 PM ISTUpdated : Mar 08, 2023, 03:11 PM IST
మహారాష్ట్రలో చిన్నారుల కిడ్నాప్.. ఏపీలో విక్రయం: కిడ్నాప్ ముఠా గుట్టురట్టు , బెజవాడ మహిళ అరెస్ట్

సారాంశం

ఎన్టీఆర్ జిల్లాలో చిన్నారుల కిడ్నాప్, విక్రయం వ్యవహారం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పర్బని జిల్లాలో 8 మంది పిల్లలను కిడ్నాప్ చేసిన ముఠా.. వారిని ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట, జగ్గయ్యపేటలలో విక్రయించారు

ఎన్టీఆర్ జిల్లాలో చిన్నారుల కిడ్నాప్, విక్రయం వ్యవహారం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో కిడ్నాప్ చేసిన చిన్నారులను ఓ ముఠా ఎన్టీఆర్ జిల్లాలో విక్రయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మహారాష్ట్రలోని పర్బని జిల్లాలో 8 మంది పిల్లలను కిడ్నాప్ చేసిన ముఠా.. వారిని ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట, జగ్గయ్యపేటలలో విక్రయించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన మహారాష్ట్ర పోలీసులు.. ఏపీకి వచ్చి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విస్సన్నపేటలో ఒకరిని, జగ్గయ్యపేటలో నలుగురు చిన్నారులను విక్రయించినట్లుగా తేల్చారు. మరో ముగ్గురి వివరాలు తెలియరాలేదు. ఈ మొత్తం రాకెట్‌లో విజయవాడకు చెందిన శ్రావణిని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. మగపిల్లలే టార్గెట్‌గా ఈ ముఠా కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు తేల్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP Food Commission Chairman: ఫోన్లోనే అధికారులకి చెమటలు పట్టించిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet
Ayyanna Patrudu Speech: అయ్యన్న పాత్రుడు స్పీచ్ కి సభ మొత్తం నవ్వులే నవ్వులు| Asianet News Telugu