ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్ ... జూన్ 1 నుంచే నీటి విడుదల, ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

Siva Kodati |  
Published : May 12, 2022, 07:31 PM IST
ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్ ... జూన్ 1 నుంచే నీటి విడుదల, ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

సారాంశం

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రులు మీడియాకు తెలిపారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) అధ్యక్షతన గురువారం  జరిగిన ఏపీ కేబినెట్ (ap cabinet meeting) సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది వ్యవసాయ సీజన్‌ను త్వరగా ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే జూన్ 1 నుంచి గోదావరి డెల్టాకు నీరు విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే అదే రోజు నుంచి రాష్ట్రంలోని కాలువలకు నీళ్లు విడుదల చేయాలని నిర్ణయించారు. 

కేబినెట్ నిర్ణయాలు:

  • జూన్ 10 నుంచి కృష్ణా డెల్టా, గుంటూరు ఛానెల్ నుంచి నీటి విడుదల
  • జూలై 15 నుంచి నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల
  • రాయలసీమకు జూన్ 30 నుంచి నీటి విడుదల
  • ఉత్తరాంధ్రకు నీటి విడుదలకు సంబంధించి త్వరలోనే తేదీల ప్రకటన
  • పులిచింతలలో పూర్తి  స్థాయిలో నీటిని నిల్వ చేసుకునేందుకు వెసులుబాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది
  • రేపు మత్స్యకార భరోసా, ఈ నెల 16 నుంచి రైతు భరోసా డబ్బులు చెల్లింపుకు ఆమోదం
  • ఈ నెల 19న పశు అంబులెన్స్‌లు ప్రారంభం
  • జూన్ 21న అమ్మ ఒడి నిధుల విడుదల
     

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!