విశాఖ పెళ్లి కూతురు మృతి కేసులో ట్విస్ట్ : సృజన బ్యాగులో గన్నేరు పప్పు, ఇష్టం లేని పెళ్లే కారణమా..?

By Siva Kodati  |  First Published May 12, 2022, 5:58 PM IST

విశాఖలో పెళ్లి పీటలపైనే నవ వధువు మరణించడం తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణను ముమ్మరం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో సృజన బ్యాగులో గన్నేరు పప్పును పోలీసులు గుర్తించారు. 
 


విశాఖలో (visakhapatnam ) పెళ్లి కూతురు (bride death case) మృతి కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గన్నేరు పప్పు (ganneru pappu) తిని నవ వధువు సృజన మృతి చెందినట్లు పోలీసులు  అనుమానిస్తున్నారు. పెళ్లి కూతురి బ్యాగ్‌లో గన్నేరు పప్పును గుర్తించామని ఏసీపీ శ్రీనివాస్. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే మనస్తాపంతోనే ఆమె గన్నేరు పప్పును తినిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. వధువు శరీరంలో పాయిజిన్ వున్నట్లు వైద్యులు చెప్పారని ఏసీపీ మీడియాకు తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. 

కాగా.. నాగోతు శివాజీ, సృజనలకు పెద్దలు పెళ్లి నిర్ణయించారు. బుధవారం రాత్రి 7 గంటలకు వివాహం జరగాల్సి వుంది. దీనికి సంబంధించి ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్  కూడా జరుపుకున్నారు. అంతలోనే ఈ దారుణం జరగడంతో కుటుంబ సభ్యలు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వధువు సృజన మృతదేహం నుండి నమూనాలను కూడా తీసి పరీక్షల కోసం పంపారు. ఆరోగ్య కారణాలతో వధువు తీసుకున్న మాత్రలు ఏమైనా వికటించాయా అనే కోణంలో కూడా వైద్యులు పరీక్షిస్తున్నారు. పెళ్లి పనుల్లో కూడా సృజన బిజిబిజీగా ఉందని బంధువులు చెబుతున్నారు.  మరోవైపు పెళ్లి రోజున కూడా ఆమె ఉల్లాసంగా , ఉత్సాహంగా గడిపిన క్షణాలను కుటుంబ సభ్యులు గుర్తు చేసుకొంటున్నారు.

Latest Videos

అంతకుముందు నిన్న ఉదయం పెళ్లి కుమార్తె సృజనకు (srujana) కడుపునొప్పి రావడంతో ఆమెను విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. సృజనను పరిశీలించిన డాక్టర్లు .. టాబ్లెట్లు, ఫ్లూయిడ్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. అప్పుడు కూడా సృజన ఆరోగ్యంగానే వుందని.. కాసేపట్లో మాంగళ్య ధారణ జరగాల్సి వుండగా ఆమె అస్వస్థతకు గురైంది. జీలకర్ర , బెల్లం పెడుతుండగా సృజన పెళ్లి పీటలపైనే స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సృజన కన్నుమూసింది. డాక్టర్లు వెల్లడించిన అంశాలపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 
 

click me!