విశాఖ పెళ్లికూతురు మృతిలో షాకింగ్ ట్విస్ట్: కడుపు నొప్పితో ముందే ఆసుపత్రికి, ఇంటికొచ్చాకే ఈ ఘోరం

Siva Kodati |  
Published : May 12, 2022, 04:23 PM IST
విశాఖ పెళ్లికూతురు మృతిలో షాకింగ్ ట్విస్ట్: కడుపు నొప్పితో ముందే ఆసుపత్రికి, ఇంటికొచ్చాకే ఈ ఘోరం

సారాంశం

విశాఖలో పెళ్లి పీటలపైనే నవ వధువు మరణించడం తెలుగు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణను ముమ్మరం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖ (visakhapatnam ) పెళ్లి కూతురు (bride death) మృతి కేసులో పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. గతంలో ఆమెకు అనారోగ్యం ఏమైనా వుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నిన్న ఉదయం పెళ్లి కుమార్తె సృజనకు (srujana) కడుపునొప్పి రావడంతో ఆమెను విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. సృజనను పరిశీలించిన డాక్టర్లు .. టాబ్లెట్లు, ఫ్లూయిడ్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. 

అప్పుడు కూడా సృజన ఆరోగ్యంగానే వుందని.. కాసేపట్లో మాంగళ్య ధారణ జరగాల్సి వుండగా ఆమె అస్వస్థతకు గురైంది. జీలకర్ర , బెల్లం పెడుతుండగా సృజన పెళ్లి పీటలపైనే స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సృజన కన్నుమూసింది. డాక్టర్లు వెల్లడించిన అంశాలపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 

ALso Read:విశాఖలో విషాదం: పెళ్లి మండపంలోనే వధువు మృతి

కాగా.. నాగోతు శివాజీ, సృజనలకు పెద్దలు పెళ్లి నిర్ణయించారు. బుధవారం రాత్రి 7 గంటలకు వివాహం జరగాల్సి వుంది. దీనికి సంబంధించి ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్  కూడా జరుపుకున్నారు. అంతలోనే ఈ దారుణం జరగడంతో కుటుంబ సభ్యలు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వధువు సృజన మృతదేహం నుండి నమూనాలను కూడా తీసి పరీక్షల కోసం పంపారు. ఆరోగ్య కారణాలతో వధువు తీసుకున్న మాత్రలు ఏమైనా వికటించాయా అనే కోణంలో కూడా వైద్యులు పరీక్షిస్తున్నారు. పెళ్లి పనుల్లో కూడా సృజన బిజిబిజీగా ఉందని బంధువులు చెబుతున్నారు.  మరోవైపు పెళ్లి రోజున కూడా ఆమె ఉల్లాసంగా , ఉత్సాహంగా గడిపిన క్షణాలను కుటుంబ సభ్యులు గుర్తు చేసుకొంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ నెల 11న విశాఖపట్టణంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఘటన చోరీ చేసుకుంది. పెళ్లికి కొన్ని గంటల ముందే వరుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని  దినేష్ అనే యువకుడు  ఆత్మహత్య చేసుకొన్నాడు. పెళ్లికి ముందు రోజు ఇంటి నుండి వెళ్లిపోయిన దినేష్ సూసైడ్ చేసుకొన్నాడు.  మృతుడు దినేష్ విశాఖపట్టణంలోని హెచ్‌పీసీఎల్ కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

ముద్రగడ పద్మనాభం ఇకలేరు | Mudragada Padmanabham Passes Away | Kapu Leaders Pressmeet
విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగిన జగన్.. భారీగా వచ్చిన ఫ్యాన్స్ ని చూసి షాక్ | Jagan Visakhapatnam Tour