గెలుపు కష్టమని అంగీకరించినట్లేనా ?

Published : Mar 07, 2017, 04:28 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
గెలుపు కష్టమని అంగీకరించినట్లేనా ?

సారాంశం

ఒక్కరు రాజీనామా చేయగానే 21 మంది వైసీపీ ఫిరాయింపు ఎంఎల్ఏల చేత ఎందుకు రాజీనామా చేయించరని చంద్రబాబుపై వైసీపీ ఒత్తడి మొదలుపెడుతుంది.

సమాధానాలు చెప్పటంలో, సమర్ధించుకోవటంలో తండ్రిని మించిన వాడిననిపించుకుంటున్నాడు లోకేష్. తాజాగా ఎంఎల్సీ గా నామినేషన్ వేసిన తర్వాత లోకేష్ మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనం. ఎంఎల్ఏగా పోటీ చేయటం ద్వారా  ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రవేశించటంపై మీడియా ప్రశ్నించింది. లోకేష్ సమాధానమిస్తూ, తన కోసం ఇంకెవరినో బలి తీసుకోవటం ఇష్టం లేదన్నారు. తన కోస ఎవరో ఎందుకు ఎంఎల్ఏగా రాజీనామా చేయాలని గడుసుగా ఎదురు ప్రశ్నించారు.

 

ఎవరైనా ఎంఎల్ఏగా రాజీనామా చేస్తే వారిని బలి తీసుకున్నట్లే అని లోకేష్ ఎందుకు అనుకుంటున్నారు. ఎంఎల్ఏ గా ఎవరైతే రాజీనామా చేస్తారో ఆ నియోజకవర్గంలో లేకేష్ పోటీ చేస్తారు. ఇపుడు లోకేష్ వేసిన నామినేషన్ సదరు రాజీనామా చేసిన ఎంఎల్ఏతో వేయిస్తే సరిపోతుంది కాదా? కుండమార్పిడి విధానంలో లెక్క సరిపోతుంది కదా?  ఇందులో ఎవరినో బలి తీసుకునేదేముంది? అయితే, ఇక్కడే లోకేష్ అతి తెలివి బయటపడుతోంది.

 

తన కోస ఒక్క ఎంఎల్ఏ రాజీనామా చేస్తే సరిపోదు. ఎందుకంటే, ఒక్కరు రాజీనామా చేయగానే 21 మంది వైసీపీ ఫిరాయింపు ఎంఎల్ఏల చేత ఎందుకు రాజీనామా చేయించరని చంద్రబాబుపై వైసీపీ ఒత్తడి మొదలుపెడుతుంది. నానా రచ్చ చేస్తుంది. అపుడు జాతీయ మీడియా దృష్టి ఏపిపై పడుతుంది. అది చంద్రబాబునాయుడుకు చాలా ఇబ్బంది. ఈ విషయాలు లోకేష్ కు తెలీవని అనుకునేందుకు లేదు. కాబట్టే అతి తెలివితో మీడియా సమావేశాన్ని నెట్టుకొచ్చేసారు లోకేష్.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?