త్వరలో ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరు కానున్న కేసీఆర్..

Published : Jan 05, 2023, 11:13 AM IST
త్వరలో ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరు కానున్న కేసీఆర్..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ ఆవిర్భావసభకు సన్నాహాలు మొదలయ్యాయి. త్వరలో అక్కడ ఏర్పాటు చేసే సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. 

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ఆవిర్భావ సభకు పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నియమితులైన సంగతి తెలిసిందే. బుధవారం తోట చంద్రశేఖర్, పార్టీ నేత చింతల పార్థసారథిలు  హైదరాబాద్ లోని ప్రగతిభవన్లో కెసిఆర్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ.. పార్టీ  పటిష్ట నిర్మాణం మీద చర్చించారు.

ఆంధ్రప్రదేశ్లో బిఆర్ఎస్ ఆవిర్భావ సభను ఎక్కడ నిర్వహించాలో సభా వేదిక, నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ తో కెసిఆర్ మాట్లాడుతూ  దేశంలో గుణాత్మక మార్పు సందేశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించాలని కెసిఆర్ మార్గనిర్దేశనం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, అభివృద్దిపై బీఆర్ఎస్ స్టాండ్ క్లియర్.. మరి వాటి సంగతేమిటి..!

ఏపీలో బీఆర్ఎస్ పార్టీకోసం పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు  చేపట్టాలని సూచించారు. నిర్మాణాత్మక ధోరణితో ముందుకు వచ్చే వారిని బీఆర్ఎస్ పార్టీలో చేసుకోవాలని అన్నారు. పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీల రూపకల్పనకు కృషి చేయాలని తెలిపారు. దీని మీద ఏపీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్  వివరాలు తెలుపుతూ..  కెసిఆర్ చేసిన దిశానిర్థేశాల మేరకే  ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. వాటిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి ఏపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని అన్నారు.  ఇప్పటికే తనను చాలా మంది సంప్రదిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Reviews GSDP, RTGS & Pattadar Passbooks at AP Secretariat | Asianet News Telugu
Manchu Family Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ | Asianet News Telugu