ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ : కాపు నేతలకు సీఎం పదవి.. కేసీఆర్ వ్యూహాం ఇదే, తోట చంద్రశేఖర్ కామెంట్స్

By Siva KodatiFirst Published Jan 22, 2023, 6:48 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్‌ను విస్తరించాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా కాపు నేతలకు సీఎం పదవిని ఇవ్వాలని ఆయన నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 
 

కాపుల ఆత్మీయ సమావేశంలో రాజకీయ చర్చ ఆసక్తికరంగా మారింది. తోట చంద్రశేఖర్ సహా ఇతర నాయకులు బీఆర్ఎస్‌లో చేరికకు గల కారణాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో కాపులను సీఎం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని తోట చంద్రశేఖర్ తెలిపారు. కేసీఆర్ హామీ వెనుక ప్రణాళికపై చర్చించారు నేతలు. ఇప్పటికే ఏపీ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సభలు, సమావేశాలకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అలాగే టీడీపీ జనసేన పొత్తులపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇరు పార్టీలు కలిస్తే ఎవరికి అడ్వాంటేజ్, కాపులకు పవర్ షేరింగ్ ఛాన్స్ ప్రస్తావించారు. ఇటీవల కాపు నేత హరిరామ జోగయ్య రాసిన లేఖపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో ఏపీ కాపు నేతల వరుస సమావేశాలు ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి. 

ఇకపోతే.. వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రధానంగా కాపుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈరోజు ఏపీ కాపు నేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ తదితర కాపు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించి కేసీఆర్ విధానాలను తోట చంద్రశేఖర్ వివరించారు. అలాగే వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనల్లోని కాపు నేతల గురించి వీరంతా చర్చించినట్లుగా తెలుస్తోంది. 

ALso REad: హైదరాబాద్‌లో ఏపీ కాపు నేతల సమావేశం.. హాజరైన తోట చంద్రశేఖర్, గంటా, కన్నా

మరోవైపు.. శనివారం కాపు సంక్షేమ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించాలంటూ పొత్తులు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా వుండేందుకు పొత్తులు అత్యవసరమని ఆయన అన్నారు. వైసీపీని ఓడించే సత్తా టీడీపీ- జనసేనకే వుందని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా వుండాలనేది కాపు సంక్షేమ సేన ప్రధాన డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభాలో 22 శాతం వున్న కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలని, అంటే సీఎం పదవేనని హరిరామ జోగయ్య కుండబద్ధలు కొట్టారు. 
 

click me!