ఏపీలో సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల స్కాం: కర్ణాటకలో ఆరుగురి అరెస్ట్

Published : Oct 06, 2020, 03:13 PM IST
ఏపీలో సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల స్కాం: కర్ణాటకలో ఆరుగురి అరెస్ట్

సారాంశం

సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కుంభకోణం ద్వారా రూ. 117 కోట్లను కాజేసేందుకు  ప్రయత్నించిన ఆరుగురిని కర్ణాటక పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.

అమరావతి: సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కుంభకోణం ద్వారా రూ. 117 కోట్లను కాజేసేందుకు  ప్రయత్నించిన ఆరుగురిని కర్ణాటక పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.

సీఎంఆర్ఎఫ్  నిధులను నకిలీ చెక్కుల ద్వారా రూ.117 కోట్లు స్వాహా చేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని బ్యాంకు అధికారులు గుర్తించడంతో ఈ విషయం వెలుగు చూసింది.

also read:స్నేహితుడి సలహా మేరకే అలా చేశా: నకిలీ చెక్కులతో సీఎంఆర్ఎఫ్ నిధుల డ్రా చేసిన భాస్కర్ రెడ్డి

దీంతో ఏపీ రెవిన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఏసీబీ విచారణకు కూడ ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ ఏసీబీలోని అర్బన్ కరప్షన్ అధికారులు  ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాంకు అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 21న రెవిన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. సీఎం జగన్ ఆదేశాలతో విచారణ చేస్తున్న పోలీసులు  ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

ఏపీ పోలీసుల సమాచారం మేరకు కర్ణాటక పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం