
రాష్ట్ర ప్రభుత్వం కాపుల చెవుల్లో క్యాబేజీ పెట్టారని ఎద్దేవా చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. విజయవాడలో కాపులతో సమావేశం నిర్వహించి తమను మభ్య పెట్టడానికి ప్రభుత్వం మరో ప్లాన్ కు రంగం సిద్దం చేసిందని ఆయన ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వం కాపుల ఉద్యమాన్ని మరింత తుంగలోకి తొక్కుతున్నారని ముద్రగడ అన్నారు. ఓవైపు కాపు ఉద్యమాన్ని అణిచివేస్తు, మరో వైపు కాపులతో సమ్మేలళన సభలు ఎంటని ఆయన ప్రశ్నించారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓట్ల కోసంమే కాపులతో ప్రభుత్వం ఆడుతున్న మరో కొత్త డ్రామా గా ఆయన అభివర్ణించారు. నంద్యాల ఎన్నికలో ఎవరిని ఓడించాలో కాపులకు బాగా తెలసునని ఆయన అన్నారు. సోమవారం జరిగిన కాపుల సమావేశంలో శుభవార్త చెబుతారనుకుంటే రెండోసారీ తమ చెవిలో పెద్ద క్యాబేజీ పెట్టారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. అయితే ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రను మరోసారి పోలీసులు అడ్డుకున్నారు.