వ్యాఖ్యల ఎఫెక్ట్: ప్రజా సంకల్పయాత్రకు కాపుల సెగ, జగన్‌ను అడ్డుకొనే యత్నం

Published : Jul 29, 2018, 05:36 PM ISTUpdated : Jul 30, 2018, 12:16 PM IST
వ్యాఖ్యల ఎఫెక్ట్: ప్రజా సంకల్పయాత్రకు కాపుల సెగ, జగన్‌ను అడ్డుకొనే యత్నం

సారాంశం

కాపుల రిజర్వేషన్లు రాష్ట్రం పరిధిలో లేవు.... కేంద్రమే రిజర్వేషన్లను అమలు చేయాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  ప్రకటన చేయడంపై కాపులు ఆగ్రహం వ్యక్తం చేశారు


కిర్లంపూడి: కాపుల రిజర్వేషన్లు రాష్ట్రం పరిధిలో లేవు.... కేంద్రమే రిజర్వేషన్లను అమలు చేయాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  ప్రకటన చేయడంపై కాపులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనను  నిరసిస్తూ  కిర్లంపూడి మండంలోని గోనేడ వద్ద  కాపు కార్యకర్తలు  వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు అడ్డు తగిలారు.  ప్ల కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు, జగన్ సెక్యూరిటీ సిబ్బంది నిరసనకారులను బయటకు పంపారు.

తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడి మండలంలోకి  ఆదివారం నాడు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రవేశించింది.ఈ పాదయాత్రకు కాపులు అడ్డు తగిలారు.  కాపుల రిజర్వేషన్ల విషయమై  వైఎస్ జగన్ చేసిన  ప్రకటనను వెనక్కి తీసుకోవాలని  వారు డిమాండ్ చేశారు. 

ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శించి జగన్ పాదయాత్రను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఆ సమయంలో జగన్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు కాపు ఆందోళన కారులను అడ్డుకొన్నారు. పాదయాత్రకు ఇబ్బందులు కలగకుండా ఆందోళనకారులను పంపించివేశారు.

ఈ సమయంలో పోలీసులకు, జగన్ సెక్యూరిటీ సిబ్బందికి మధ్య తోపులాట చోటుచేసుకొంది. కాపు రిజర్వేషన్ల విషయమై జగన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని  ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

ఈ వార్తలు చదవండి

1.కాపు రిజర్వేషన్: మీకు మేం ఎందుకు ఓట్లెయ్యాలి:జగన్‌‌కు ముద్రగడ కౌంటర్

2.కాపులకు అన్యాయం చేసే నైజం జగన్‌ది: కళా వెంకట్రావు

 

 

 

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu