కాపులకు అన్యాయం చేసే నైజం జగన్‌ది: కళా వెంకట్రావు

Published : Jul 29, 2018, 04:22 PM ISTUpdated : Jul 30, 2018, 12:16 PM IST
కాపులకు అన్యాయం చేసే నైజం జగన్‌ది: కళా వెంకట్రావు

సారాంశం

కాపులకు  అన్యాయం చేసే  నైజం జగన్‌లో స్పష్టంగా కన్పిస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు  చెప్పారు.  బీజేపీ డైరెక్షన్‌లో పనిచేస్తున్న జగన్, పవన్ కళ్యాణ్‌లు  కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయమై  ప్రధానమంత్రి మోడీని ఒప్పించాలని ఆయన కోరారు.

అమరావతి:కాపులకు  అన్యాయం చేసే  నైజం జగన్‌లో స్పష్టంగా కన్పిస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు  చెప్పారు.  బీజేపీ డైరెక్షన్‌లో పనిచేస్తున్న జగన్, పవన్ కళ్యాణ్‌లు  కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయమై  ప్రధానమంత్రి మోడీని ఒప్పించాలని ఆయన కోరారు.

ఆదివారం నాడు ఆయన   మీడియాతో మాట్లాడారు.  బీసీలకు అన్యాయం చేయకుండా  కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని కళా వెంకట్రావు చెప్పారు. న్యాయ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా కాపు రిజర్వేషన్లను అమలు చేసేందుకు తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొన్నామని కళా వెంకట్రావు చెప్పారు. కాపులకు రిజర్వేషన్ల విషయమై రాష్ట్రపరిధిలో చేయాల్సిన పనులన్నింటిని పూర్తి చేసినట్టు చెప్పారు.

ఈ రిజర్వేషన్ల విషయమై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి కళా వెంకట్రావు చెప్పారు. పార్టీ ఏర్పాటు చేసిన నాలుగేళ్లు దాటినా పవన్ కళ్యాణ్ ఇంకా తమ పార్టీ విధి విధానాలను ఎందుకు ప్రకటించలేదో చెప్పాల్సిందిగా కోరారు.  

ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంటే  అభివృద్ధి చేస్తామని చెప్పకుండా  విషబీజాలు నాటడం సరైందా అని ఆయన ప్రశ్నించారు. ఏపీ రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని అడ్డుకొంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు.రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంటే  పవన్ కళ్యాణ్  రాజధాని నిర్మాణం అడ్డుకొంటానని ప్రకటించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.

ఈ వార్తలు చదవండి

1.కాపు రిజర్వేషన్: మీకు మేం ఎందుకు ఓట్లెయ్యాలి:జగన్‌‌కు ముద్రగడ కౌంటర్

2.ఇంకెంత మందిని బలి తీసుకొంటారు: టీడీపీ, బీజేపీలపై బొత్స ఫైర్

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu