అమరావతిలో కాపు నేతల జూమ్ మీటింగ్.. అస్తిత్వం కోల్పోతున్నామని ఆందోళన

By Siva KodatiFirst Published Jan 23, 2022, 8:29 PM IST
Highlights

అమరావతిలో కాపు నేతలు (kapu leaders) కీలక సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీల్లోని కాపు నేతలు, కాపు సామాజిక వర్గ ప్రముఖులు జూమ్ మీటింగ్ పెట్టుకున్నారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా కాపులు అస్థిత్వం కొల్పోయేలా పరిణామాలు చోటు చేసుకోవడంపై ఆందోళన చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

అమరావతిలో కాపు నేతలు (kapu leaders) కీలక సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీల్లోని కాపు నేతలు, కాపు సామాజిక వర్గ ప్రముఖులు జూమ్ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో గంటా శ్రీనివాసరావు, బొండా ఉమా మహేశ్వరరావు, వట్టి వసంత కుమార్, మాజీ ఐఏఎస్‌‌లు రామ్మోహన్, భాను, మాజీ ఐపీఎస్ సాంబశివరావు సహా ఏపీలోని 13 జిల్లాల్లోని కాపు ప్రముఖులకూ కాన్ఫరెన్స్‌కు ఆహ్వానం అందింది. సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా కాపులు అస్థిత్వం కొల్పోయేలా పరిణామాలు చోటు చేసుకోవడంపై ఆందోళన చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

ప్రభుత్వంలో కాపులకు లభిస్తోన్న ప్రాధాన్యత, కాపు సంక్షేమ కార్యక్రమాల పైనా చర్చ జరుగుతోంది. కాపు కార్పోరేషన్ పరిస్ధితి (kapu corporation) దారుణంగా వుందని.. సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డట్టు సమాచారం. పార్టీలకతీతంగా సామాజిక వేదిక ఏర్పాటుకు నిర్ణయించారు. వచ్చే నెల రెండో వారంలో విజయవాడలో భేటీ కావాలని నేతలు నిర్ణయించారు. ఈ వేదిక ద్వారానే రాజకీయ లక్ష్యాలు నెరవేర్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. 

కాగా.. Andhra pradesh రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు విషయమై Kapu సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇటీవల సమావేశమయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు గత ఏడాది డిసెంబర్ మాసంలో Hyderabad వేదికగా సమావేశమయ్యారు. అదే సమయంలో Dalita, B.c  నేతలు కూడా ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు.  రాష్ట్రంలో కాపులకు రాజకీయ అధికారం విషయమై చర్చించారు.ఈ సమావేశాల తర్వాత ముద్రగడ పద్మనాభం ఈ లేఖ రాయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.

కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు వరుసగా సమావేశమైన సమయంలో రాష్ట్రంలో పార్టీల పరిస్థితిపై కూడా చర్చించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు పార్టీలు ఏర్పాటు చేసి రాజకీయంగా విఫలమయ్యారనే చర్చ కూడా  ఈ సమావేశాల్లో కొందరు కాపు నేతలు అభిప్రాయపడినట్టుగా సమాచారం.  కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు సమావేశం కావడాన్ని ఏపీలోని ప్రధాన పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.  అధికారంలో ఉన్న వైసీపీ, విపక్ష టీడీపీలు ఈ సమావేశాలపై ఆరా తీస్తున్నాయి. అయితే కాపు సామాజిక వర్గం నేతలు సమావేశం కావడంపై టీడీపీ సమాచార సేకరణలో ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాల వెనుక ఎవరున్నారనే విషయమై ఆ పార్టీ నాయకత్వం కేంద్రీకరించిందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు సుమారు 12 శాతం ఉంటారు.  రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాపు సామాజిక ఓటర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు.ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే  కాపులు రాజకీయాధికారాన్ని దక్కించుకోవడం కోసం సమావేశాలు నిర్వహించడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

click me!