నైరుతి గాలుల ఎఫెక్ట్.. ఏపీలో అక్కడక్కడా వర్షాలు, మూడు రోజులకు అప్‌డేట్స్ ఇవే

By Siva KodatiFirst Published Jan 23, 2022, 6:24 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌‌లో (ap weather updates) రాగల మూడు రోజుల్లో అక్కడక్కడా వర్షం కురిసే (rain alert) అవకాశం వుంది. ప్రధానంగా నైరుతి దిశ నుండి గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయని, దీని ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణంలో వివిధ మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్‌‌లో (ap weather updates) రాగల మూడు రోజుల్లో అక్కడక్కడా వర్షం కురిసే (rain alert) అవకాశం వుంది. ప్రధానంగా నైరుతి దిశ నుండి గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయని, దీని ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణంలో వివిధ మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ (imd) వెల్లడించింది. 

  • ఉత్తరకోస్తాంధ్ర ప్రాంతంలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
  • ఇవాళ, రేపు దక్షిణకోస్తాంధ్రలో ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
  • రాయలసీమలో ఈరోజు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
     
click me!