సోమవారం 12 మందికి పాజిటివ్ గా తేలడంతో షార్ యాజమాన్యం ఉలిక్కిపడింది. వీరిలో ఇద్దరు వైద్యులు ఉండటం విశేషం. సూళ్లూరుపేటలోని షార్ ఉద్యోగుల కేఆర్పీ, డీఆర్ డీఎల్ లలో ఒక్కొక్కరు, సూళ్లూరుపేట శివార్లలో మరో షార్ విశ్రాంత ఉద్యోగికి కరోనా సోకడంతో సూళ్లూరుపేటలో కూడా కరోనా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
నెల్లూరు : Sriharikotaలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో Corona కలకలం చెలరేగింది. ఇద్దరు వైద్యులతో సహా 12 మందికి పాజిటివ్ వచ్చింది. షార్ లో గత నెల 27వ తేదీ నుంచి వరుసగా కేసులు నమోదవుతున్నాయి. Omicron అయి ఉండొచ్చనే అనుమానంతో ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.
అంతేకాదు షార్ లో కరోనా Third wave ప్రారంభమయ్యిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సోమవారం 12 మందికి పాజిటివ్ గా తేలడంతో షార్ యాజమాన్యం ఉలిక్కిపడింది. వీరిలో ఇద్దరు వైద్యులు ఉండటం విశేషం. సూళ్లూరుపేటలోని షార్ ఉద్యోగుల కేఆర్పీ, డీఆర్ డీఎల్ లలో ఒక్కొక్కరు, సూళ్లూరుపేట శివార్లలో మరో షార్ విశ్రాంత ఉద్యోగికి కరోనా సోకడంతో సూళ్లూరుపేటలో కూడా కరోనా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
undefined
APSRTC: ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతి భారీ స్పెషల్ బస్సులు.. పూర్తి వివరాలివే..
కాగా, దేశంలో corona cases పెరుగుతుండడంతో ముందు జాగ్రత్తగా కేంద్ర Government officesల్లోని సెక్రటరీ స్థాయికి దిగువన ఉండే సిబ్బంది లో 50 శాతం మందికి work from homeకు అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ అన్ని all Ministries to departmentsకు తక్షణం వర్తించే ఈ ఆదేశాలు జనవరి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని సోమవారం తెలిపింది.
వాస్తవ సిబ్బంది సంఖ్యలో 50 శాతం మంది మాత్రమే ఆఫీసు విధులకు హాజరు కావాలని, మిగతా సగం మందికి వర్క్ ఫ్రం హోం అమలుచేయాలని వివరించింది. దివ్యాంగులు, గర్భిణీలకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా, కంటెయిన్ మెంట్ జోన్ లలో నివాసం ఉండే వారికి కూడా ఆయా జోన్లను డీనోటిఫై చేసేవరకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.
CM KCR: ఆ విషయంలో తగ్గేదేలే.. సీఎస్ కు దిశా నిర్దేశం
ఉద్యోగులంతా ఒకే సమయంలో కార్యాలయాలకు రాకుండా అమలు వేర్వేరు పనివేళలను అమలు చేయాలని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది అందరూ హాజరు పట్టికలో సంతకాలు చేసి తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా కరోనా మరో సారి తన పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా వణుకు పుట్టిస్తోంది. ఒక్క రోజే గడిచిన 24 గంటల్లో 8,082 కేసులు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో 574 మంది రోగులు ఆసుపత్రిలో చేరిగా.. మరో 622 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 37,274గా నమోదయ్యింది.