త్వరలో జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అత్యధికమంది కాపు సామాజికవర్గ నాయకులకు పోటీచేసే అవకాశం కల్పించాలని హరిరామజోగయ్య కోరారు. ఈ మేరకు ఆయన పవన్ కల్యాణ్ ఎవరెవరికి ఏఏ నియోజకవర్గాల్లో సీటు ఇవ్వాలో సూచిస్తే లేఖ రాసారు.
అమరావతి : ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇప్పటికే వైసిపి అభ్యర్థులను దాదాపు ఖరారుచేయగా... టిడిపి-జనసేన కూటమి ఇంకా సీట్ల సర్దుబాటు విషయంలో తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే ఇరుపార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పలుమార్లు సమావేశమై చర్చించినా ఏ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేయాలన్నదానిపై క్లారిటీ రాలేదు. ఇలాంటి సమయంలో కాపు సామాజికవర్గానికి చెందినవారు ఎవరెవరికి ఏయే నియోజకవర్గాల్లో జనసేన సీట్లు కేటాయించాలో సూచిస్తూ కాపు సంక్షేమ సేన పవన్ కల్యాణ్ కు లేఖ రాసింది.
రాష్ట్ర జనాభాలో 25 శాతం వున్న కాపులకు అధిక సీట్లు ఇవ్వాలని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య ఈ లేఖ ద్వారా పవన్ కల్యాణ్ ను కోరారు. ఆర్థికంగా బలవంతులైన కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు కులస్తులకు జనసేన అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు కేటాయించాలని కోరారు. జిల్లాలు, నియోజకవర్గాల వారిగా అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్లు ఏ కాపు నేతలకు ఇవ్వాలో పేర్లతో సహా సూచించారు. వీరికి తప్పకుండా సీటు ఇవ్వాలని పవన్ కల్యాణ్ కు డిమాండ్ చేసారు హరిరామ జోగయ్య.
జనసేన పార్టీ అసెంబ్లీ, లోక్ సభ టికెట్లు కోరుతున్న కాపు నేతలు :
ఉమ్మడి పశ్చిమ గోదావరి :
నరసాపురం - పవన్ కల్యాణ్
భీమవరం - పవన్ కల్యాణ్
తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్
నిడదవోలు - చేగొండి సూర్యప్రకాష్
ఉంగుటూరు - పుప్పాల శ్రీనివాస్
ఏలూరు - రెడ్డి అప్పలనాయుడు (తూర్పు కాపు) లేదా నారా శేషు
ఉమ్మడి తూర్పు గోదావరి
పిఠాపురం - తంగెళ్ల ఉదయ శ్రీనివాస్
కాకినాడ సిటీ - చిక్కాల దొరబాబు
కాకినాడ రూరల్ - పంతం నానాజీ
రాజమండ్రి - రూరల్ కె.దుర్గేష్
రాజానగరం - బత్తుల బాలకృష్ణ
కొత్తపేట - బండారు శ్రీనివాస్
రామచంద్రాపురం - పొలిశెట్టి చంద్రశేఖర్
ఉమ్మడి విశాఖ జిల్లా
పెందుర్తి - పంచకర్ల రమేష్
యలమంచిలి - సుందరపు విజయకుమార్
చోడవరం - శివశంకర్
గాజువాక - సుందరపు సతీష్
అనకాపల్లి - బొలిశెట్టి సత్యనారాయణ
భీమిలి - పంచకర్ల సందీప్
విశాఖ ఉత్తరం - పసుపులేటి ఉషా కిరణ్
ఉమ్మడి కృష్ణా
అవనిగడ్డ - బండ్రెడ్డి రామకృష్ణ లేదా బచ్చు వెంకట నాథ్ ప్రసాద్
పెడన - బూరగడ్డ వేదవ్యాస్ లేదా పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)
నూజివీడు - బర్మా ఫణిబాబు
ఉమ్మడి గుంటూరు
గుంటూరు పడమర - తులసి రామ చరణ్
దర్శి - మద్దిశెట్టి వేణుగోపాలు
ఉమ్మడి ప్రకాశం
గిద్దలూరు - ఆమంచి స్వాములు
ఉమ్మడి నెల్లూరు
కావలి - మువ్వల రవీంద్ర
రాయలసీమ జిల్లాలు
మదనపల్లి - శ్రీరామ రామాంజనేయులు
చిత్తూరు - ఆదికేశవులు నాయుడు కుటుంబసభ్యులకు
తిరుపతి - కొణిదెల నాగబాబు
నంద్యాల - శెట్టి విజయ కుమార్
గుంతకల్లు - మణికంఠ
రాజంపేట - ఎమ్.వి. రావు
అనంతపూర్ - టి.సి. వరుణ్
పుట్టపర్తి - శివ శంకర్ (బ్లూ మూన్ విద్యాసంస్థలు)
తంబళ్లపల్లి - కొండా నరేంద్ర
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు
ఎడ్చర్ల - పోగిన సురేష్ బాబు (తూర్పు కాపు)
నెల్లిమర్ల - లోకం మాధవి (తూర్పు కాపు)
విజయనగరం - గుర్రాల అయ్యలు లేదా పాలవలస యశస్విని (తూర్పు కాపు)
గజపతినగరం - పడాల అరుణ (తూర్పు కాపు)
పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా
నర్సాపురం - మల్లినీడి తిరుమలరావు (బాబి)
కాకినాడ - సాన సతీష్
మచిలీపట్నం - బాలశౌరి
అనకాపల్లి - నాగబబు లేదా బొలిశెట్టి సత్యనారాయణ
రాజంపేట - యం.వి.రావు
విజయనగరం - గేదెల శ్రీనివాస్ (తూర్పు కాపు)