డియర్ అమర్‌నాథ్.. రాజకీయాల్లో నువ్వో బచ్చావి : మంత్రి గుడివాడపై హరిరామజోగయ్య ఆగ్రహం

Siva Kodati |  
Published : Feb 05, 2023, 02:29 PM IST
డియర్ అమర్‌నాథ్.. రాజకీయాల్లో నువ్వో బచ్చావి : మంత్రి గుడివాడపై హరిరామజోగయ్య ఆగ్రహం

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు కౌంటరిచ్చారు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య. అనవసరంగా పవన్ కల్యాణ్‌పై బురద జల్లడానికి ప్రయత్నం చేయొద్దని గుడివాడకు హితవు పలికారు.   

వైసీపీ నేత, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుడివాడకు ఓ లేఖ రాసిన జోగయ్య.. రాజకీయాల్లో నువ్వో బచ్చావి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పైకి ఎదగాల్సిన వాడివి, సాధారణ మంత్రి పదవికి అమ్ముడుపోయావంటూ హరిరామజోగయ్య ఆరోపించారు. అనవసరంగా పవన్ కల్యాణ్‌పై బురద జల్లడానికి ప్రయత్నం చేయొద్దని గుడివాడకు హితవు పలికారు. 

కాగా.. కొద్దిరోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అమర్‌నాథ్ మండిపడ్డారు. పవన్ జనసేన అధ్యక్షుడు కాదని, పరోక్షంగా టీడీపీ కార్యకర్త అంటూ సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు వచ్చే ఓట్ల కంటే నోటా ఓట్లు ఎక్కువగా వుంటాయని మంత్రి కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అమర్‌నాథ్‌కు హరిరామజోగయ్య లేఖ రాయడం కలకలం రేపుతోంది. 

Also Read: కోటంరెడ్డి ఫోన్ ట్యాంపరింగ్ ఆరోపణలపై మంత్రి అమర్నాథ్ కౌంటర్...

ఇదిలావుండగా.. సొంత పార్టీ ఎమ్మెల్యే తన ఫోన్ నే వైసిపి పెద్దలు ట్యాప్ చేయించారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇటీవల స్పందించారు. ఇద్దరు వ్యక్తులు ఫోన్ లో మాట్లాడుకుంటుంటే అందులో ఒకరు ఆ సంబాషణలు రికార్డ్ చేస్తే దాన్ని ఫోన్ ట్యాంపరింగ్ అనరని అన్నారు. ఎమ్మెల్యే ఐపిఎస్ సీతారాంజనేయులే తనకు ఫోన్ రికార్డింగ్స్ ఇచ్చారని అంటున్నారని... అందులో నిజమెంతో తెలియాలన్నారు. సొంత పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం వైసిపికి లేదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేసారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం