ఎవరెన్ని చెప్పినా జనసేనతో తమ పార్టీ పొత్తు ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు.
విశాఖపట్టణం: ఎవరెన్ని చెప్పినా జనసేనతోనే పొత్తు ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు.ఆదివారం నాడు విశాఖపట్టణంలో జీవీఎల్ నరసింహరావు మీడియాతో మాట్లాడారు.సచివాలయం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని ఆయన చెప్పారు. వైజాగ్ మెట్రో ఆలస్యం కావడానికి ప్రభుత్వ ఉదాసీనతే కారణంగా ఆయన పేర్కొన్నారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న ఎంపీలకు అవగాహన అవసరమని ఆయన చెప్పారు.,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉంది. అయితే ఇటీవల భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భావసారూప్యత గల పార్టీలతో పొత్తు ఉంటుందని బీజేపీ తీర్మానం చేసింది.
undefined
జనసేనతో పొత్తు విషయమై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు జనంతో పొత్తు...కుదిరితే జనసేనతో పొత్తు ఉంటుందని వీర్రాజు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై జీవీఎల్ నరసింహరావు స్పందించారు. జనసేనతో పొత్తు ఉంటుందన్నారు.
ఏపీ రాష్ట్రంలో టీడీపీతో పొత్తు ఉంటుందనే రీతిలో జనసేన సంకేతాలు ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడకుండా తాను ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాను తన శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తన ప్రతిపాదనపై అన్ని పార్టీలు ఆలోచించాలని ఆయన కోరారు.
ఇటీవల కాలంలో రెండు దఫాలు పవన్ కళ్యాణ్, చంద్రబాబులు కలవడం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. పొత్తు విషయమై రెండు పార్టీల నుండి అధికారికంగా ప్రకటనలు రాలేదు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.