విజయవాడ లో ‘కాపు’ కాసేనా ?

Published : Dec 14, 2016, 02:18 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
విజయవాడ లో ‘కాపు’ కాసేనా ?

సారాంశం

కాపు నేతల అంచనా ప్రకారం విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని వైసీపీ గనుక కాపులకు కేటాయించి, మచిలీపట్నం సీటును బిసిలకు కేటాయిస్తే మొత్తం జిల్లాలో మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది.

కొడితే కుంభస్ధలాన్నే కొట్టాలని కాపు సామాజిక వర్గం యోచిస్తోంది. రానున్న ఎన్నికల్లో విజయవాడ ఎంపి సీటులో పోటీ చేయటం ద్వారా కోస్తా జిల్లాల్లో పట్టు సాధించాలని కాపు సామాజిక వర్గ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.  వారు అనుకున్నట్లు జరిగితే రానున్న ఎన్నికల్లో కోస్తా జిల్లాల్లో రాజకీయం భలే రంజుగా ఉండబోతోంది.

 

ఎందుకంటే, వచ్చే ఎన్నికలకు సంబంధించి కోస్తా జిల్లాల్లో కాపు సామాజిక వర్గం క్రియాశీలక పాత్ర పోషించాలని అనుకోవటమే కారణం.

 

రానున్న ఎన్నికల్లో అధికార-ప్రతిపక్షాల్లో ఏదో ఒక దాన్నుండి విజయవాడ పార్లమెంట్ స్ధానం నుండి కాపు సామాజిక వర్గమే పోటీ చేయాలని అనుకుంటోంది. తద్వారా కోస్తా ప్రాంతంలోకెల్లా ప్రధానమైన విజయవాడలో పాగా వేయాలని కాపు సామాజిక వర్గంలోని బలమైన నేతలు గట్టిగా భావిస్తున్నారు.

 

రాష్ట్రం మొత్తం మీద విజయవాడ చాలా కీలక ప్రాంతమైనప్పటికీ కులాల వారీగా చూస్తే మాత్రం విజయవాడకు ప్రత్యేకమైన స్ధానమే ఉంది. మొత్తం కోస్తా జిల్లాల్లో కాపు, కమ్మ సామాజిక వర్గాల మధ్య నెలకొన్న రాజకీయాలకు విజయవాడే కేంద్రం.

 

కొంతకాలం నుండి మొన్నటి ఎన్నికల వరకూ ఏ పార్టీ అయినా విజయవాడ పార్లమెంట్ స్ధానంలో కమ్మ సామాజిక వర్గం అభ్యర్ధులే పోటీ చేస్తున్నారు.

 

ఇదే విషయమై కొందరు కాపు నేతలు ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఓ విషయాన్ని చేరవేసినట్లు సమాచారం. విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని కాపులకు కేటాయిస్తే మొత్తం కోస్తా జిల్లాల్లో మంచి ఫలితాలు రాబట్ట వచ్చని కబురు పంపారు.

 

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన కోనేరు ప్రసాద్ ఓడిపోయిన తర్వాత ఎక్కడా కనిపించలేదు. దాంతో విజయవాడ ఎంపి స్ధానంలో పోటీ చేసేందుకు వైసీపీ బలమైన అభ్యర్ధిని వెతుక్కోవాల్సిందే. టిడిపి నుండి సిట్టింగ్ ఎంపిగా కేశినేని నానే పోటీ చేయటం ఖాయం.

 

కాపు నేతల అంచనా ప్రకారం విజయవాడ పార్లమెంట్ స్ధానాన్ని వైసీపీ గనుక కాపులకు కేటాయించి, మచిలీపట్నం సీటును బిసిలకు కేటాయిస్తే మొత్తం జిల్లాలో మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల మిగిలిన కోస్తా జిల్లాల్లో ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నారు.

 

రాజధాని నిర్మాణం అయినా, కాకపోయినా విజయవాడకు మాత్రం ప్రాధాన్యత తప్పదు. కాబట్టి కోస్తా జిల్లాల్లో మంచి ఫలితాలు రాబట్టినా విజయవాడలో గనుక టిడిపి అభ్యర్ధి గెలిస్తే వైసీపీకి కొంత ఇబ్బంది తప్పదని కూడా కాపు నేతలు జగన్ కు కబురు చేరవేసినట్లు సమాచారం.

 

జగన్ గనుక ఈ విషయాన్ని సీరియస్ గా యోచిస్తే విజయవాడ కేంద్రంగా వచ్చే ఎన్నికల్లో రాజకీయం రంజుగా ఉండటం ఖాయం. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu