బాబు యూ టర్న్ ఎందుకని మోడీ ప్రశ్న, 'వెన్నుపోటు సహజ గుణం'

First Published Jun 13, 2018, 5:35 PM IST
Highlights

బాబుపై బిజెపి హట్ కామెంట్స్


న్యూఢిల్లీ: నమ్మినవారిని వెన్నుపోటు పొడిచే సహజ గుణం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుదని బిజెపి ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా,  ప్రధానమంత్రి మోడీని కలిశారు. ఆ తర్వాత ఆయన బుధవారం నాడు న్యూఢిల్లీలో మాట్లాడారు.


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎందుకు యూ టర్న్ తీసుకొన్నారని తనను ప్రధానమంత్రి మోడీ తనను అడిగారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.  అయితే రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసమే బాబు  యూ టర్న్ తీసుకొన్నారని ఆయన చెప్పారు.

నమ్మినవారిని వెన్నుపోటు పొడిచే సహజగుణం చంద్రబాబుకు ఉందన్నారు. గతంలో కూడ 2004 లో కూడ బిజెపితో తెగతెంపులు చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విభజన హమీలు అమలు చేస్తామని కేంద్రం ఇచ్చిన హమీని నిలబెట్టుకొన్నామని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమకు చెప్పారని ఆయన  చెప్పారు.

ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని  రాష్ట్రానికి కేంద్రం బాగా నిధులు ఇచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  చెప్పిన విషయాలను కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. అయితే విదేశీ సంస్థల నుండి మొబిలైజేషన్ అడ్వాన్స్ ను 30 శాతం ఇవ్వడానికి సిద్దంగా లేకపోవడంతో ఇంటర్నల్ ఏజెన్సీ నుండి డబ్బులు తీసుకొనే వెసులుబాటు కల్పించాలని కేంద్రాన్ని కోరితే కేంద్రం కూడ సానుకూలంగా స్పందించిందన్నారు.

ఏపీ రాష్ట్రానికి కేంద్రం అన్ని  రకాలుగా సహయ సహాకారాలు చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలు కూడ బిజెపిని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్ నిర్మాణం విషయంలో కేంద్రం వెనుకడుగు వేయలేదని ఆయన చెప్పారు.దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి కూడ ఇవ్వని నిధులను ఏపీకి విడుదల చేసినట్టుగా ఆయన చెప్పారు.
 

click me!