ఏపిలో ఎందుకు వదిలేశారు: చంద్రబాబును ప్రశ్నించిన కన్నా

By telugu teamFirst Published Feb 16, 2019, 2:36 PM IST
Highlights

చంద్రబాబు ప్యాకేజీని సమర్ధించిన తీర్మానాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారని కన్నా అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

అమరావతి: తెలంగాణలో పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసును ఎందుకు వదిలేశారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు.  టీడీపీ ఓ డ్రామా కంపెనీ అని, చంద్రబాబులా తాము రోజుకో వేషం వెయ్యలేమని ఆయన అన్నారు. 

చంద్రబాబు ప్యాకేజీని సమర్ధించిన తీర్మానాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారని కన్నా అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తామని అధికారంలోకి రావడమే లక్ష్యమని తెలిపారు. 

ఈ నెల 21న రాజమండ్రిలో ముఖ్యనేతలతో అమిత్‌షా సమావేశం అవుతారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. మార్చి ఒకటిన విశాఖలో బీజేపీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమవుతారని ఆయన చెప్పారు. స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పీవీ) ఏర్పాటు చేస్తే రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కన్నా తెలిపారు.

click me!