కాపు ద్రోహులు: చినరాజప్ప, బాబుపై అవాకులు చవాకులు: కళా

By telugu teamFirst Published Feb 16, 2019, 2:26 PM IST
Highlights

ఆమంచి, అవంతిని ఆడవాళ్లు చీపుళ్లతో కొడతారని చిన రాజప్ప హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి రాదని, మంత్రి పదవులు ఎలా వస్తాయని అన్నారు. దమ్ము, ధైర్యం ఉన్నోళ్లు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని, గెలుస్తామనే ధైర్యం ఉంది కాబట్టే ఎమ్మెల్సీలు రాజీనామా చేశారని అన్నారు.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ పార్టీలు మారి కాపు ద్రోహులుగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న జగన్ పార్టీలోకి ఎలా వెళ్లారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. 

ఆమంచి, అవంతిని ఆడవాళ్లు చీపుళ్లతో కొడతారని చిన రాజప్ప హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి రాదని, మంత్రి పదవులు ఎలా వస్తాయని అన్నారు. దమ్ము, ధైర్యం ఉన్నోళ్లు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని, గెలుస్తామనే ధైర్యం ఉంది కాబట్టే ఎమ్మెల్సీలు రాజీనామా చేశారని అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఎమ్మెల్సీల రాజీనామాపై పార్టీదే తుది నిర్ణయమని ఆయన అన్నారు.

టీడీపీ నుంచి  వైదొలిగి వైసీపీలో చేరిన నేతలపై మంత్రి కళా వెంకట్రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారే వాళ్లంతా రాజకీయ స్వభావం లేని వారేనని విమర్శించారు. రాజకీయాల కోసం పార్టీ మారుతున్నారని ఆరోపించారు. 

పరిపక్వత లేనివారి గురించి స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్నారని మంత్రి కళా వెంకట్రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

click me!