దాతృత్వాన్ని చాటుకున్న టిజి.భరత్... రూ.50లక్షల విరాళం

Published : Feb 16, 2019, 02:15 PM IST
దాతృత్వాన్ని చాటుకున్న టిజి.భరత్... రూ.50లక్షల విరాళం

సారాంశం

కర్నూల్ జిల్లా సీనియర్ పోలిటీషషన్, టిడిపి రాజ్యసభ సభ్యులు టిజి. వెంకటేశ్ తనయుడు టిజి.భరత్  తన దాతృత్వాన్ని చాటుకున్నారు. జిల్లా ప్రజలకోసం సేవాకార్యక్రమాలు చేపడుతున్న అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్టుకు భరత్ రూ.50 వేల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రజా సేవ కోసం ఖర్చు చేయాలని  ఆయన ట్రస్టు సభ్యులకు సూచించిన విషయం తెలిసిందే.   

ఇవాళ పెనుగొండ క్షేత్రాన్ని రాజ్యసభ సభ్యులు టీజీ. వెంకటేష్, ప్రముఖ వ్యాపారవేత్త, జీఎమ్మార్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు తో కలిసి సందర్శించారు. ఆ సందర్భంగా వీరిద్దరు కలిసి వాసవీ పెనుగొండ ట్రస్ట్ చైర్మన్ గోవిందరాజులుకు భరత్ ప్రకటించిన విరాళం రూ.50 లక్షలను చెక్కు రూపంలో అందజేశారు.   

కర్నూల్ జిల్లాలోని నిరుపేదలకు, విద్యార్థులకు ఆదుకోడానికి వాసవి ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంటుంది. నిరుపేద విద్యార్థుల చదువుల కోసం,మారుమూల ప్రాంతాల్లో విద్యా సదుపాయాలు కల్పించడం, పేదల  ఆకలి బాధలు తీర్చడం వంటి కార్యక్రమాలను ఆ ట్రస్టు చేపడుతుంది.  దీంతో దాతలు కూడా ఈ ట్రస్టుకు అధికమొత్తంలో విరాళాలు అందిస్తుంటారు. ఇలా సేవాదృక్ఫథంతో వాసవి ట్రస్ట్ పనిచేస్తుండటాన్ని గుర్తించిన టిజి. భరత్ కూడా తన వంతు సాయంగా రూ.50 లక్షలు ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు