చంద్రబాబుకి అరెస్ట్ వారెంట్.. స్పందించిన కన్నా

By ramya neerukondaFirst Published Sep 14, 2018, 2:22 PM IST
Highlights

చంద్రబాబుకు నోటీసులు రావడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. 2013 నుంచి కేసు నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పందించారు. చంద్రబాబుకు నోటీసులు రావడం వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. 2013 నుంచి కేసు నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. 2016 వరకు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తూ వచ్చారు.. చివరి 22 వాయిదాలకు వెళ్లకపోవడం వల్ల నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారంట్‌ జారీ చేశారని వెల్లడించారు.

కేవలం ముద్దాయిలు 22 సార్లు కోర్టుకు వెళ్లకపోవడం వల్లనే వారెంట్‌ వచ్చిందని తెలిపారు. సాధారణంగా 3 సార్లు ముద్దాయిలు కోర్టుకు వెళ్లకపోతే నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ వస్తుందని వివరించారు. ఇప్పుడు కొత్తగా నోటీసుల వెనక మోదీ ఉన్నారని కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మీద కేసు కాంగ్రెస్‌ హయాంలో పెట్టిందని గుర్తు చేశారు. వాయిదాలకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులను అగౌరవపరిచేలా వ్యవహరించారని విమర్శించారు.

click me!