బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్‌తో మాకేం సంబంధం: పురంధేశ్వరీ

By narsimha lodeFirst Published Sep 14, 2018, 1:24 PM IST
Highlights

బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేయడంలో  తమకు ఎలాంటి సంబంధం ఉంటుందని  మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత  పురంధేశ్వరీ  ప్రశ్నించారు.

హైదరాబాద్: బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేయడంలో  తమకు ఎలాంటి సంబంధం ఉంటుందని  మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత  పురంధేశ్వరీ  ప్రశ్నించారు.

శుక్రవారం నాడు ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బాబ్లీ ప్రాజెక్టు కేసు 2010లో కేసు నమోదైందన్నారు. అయితే ఈ కోర్టు వారంట్ జారీ చేస్తే  బీజేపీకి ఎలాంటి సంబంధం ఉంటుందని ఆమె ప్రశ్నించారు.

ఆపరేషన్ గరుడ అంటే తనకు తెలియదన్నారు. అసలు ఆపరేషన్ గరుడతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా చంద్రబాబునాయుడును అరెస్ట్ చేస్తారని  సినీ నటుడు శివాజీ ప్రకటించిన రెండు రోజులకే  బాబుకు నోటీసులు జారీ చేయడంపై  తనకేమీ తెలియదన్నారు. ఈ విషయాన్ని శివాజీనే అడగాలని ఆమె కోరారు.

ప్రతి విషయాన్ని బీజేపీ మీదకు నెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు.  ఈ రకమైన  తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ఆమె హితవు పలికారు. బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయమై ధర్మాబాద్ కోర్టు వారంట్ జారీ చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉంటుందని ఆమె ప్రశ్నించారు. 

ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాతే తప్పుడు కేసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పడం సరైంది కాదన్నారు. ఏపీ సర్కార్ తో పాటు టీడీపీ నేతలపై చంద్రబాబునాయుడుపై కక్షపూరితంగా ఏ అంశాల్లో వ్యవహరిస్తోందనే ప్రచారాన్ని ఆమె తప్పుబట్టారు.  ఉద్దేశ్యపూర్వకంగా  నిందలు వేయడాన్ని మానుకోవాలని ఆమె టీడీపీ నేతలకు సూచించారు.


 

click me!