ఎవరెన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏమీ చెయ్యలేరు

By rajesh yFirst Published Sep 14, 2018, 2:19 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం పోరాడిన సీఎం చంద్రబాబుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడం కుట్రలో భాగమేనని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఇన్నాళ్లూ అసలు కేసే లేదని చెప్పిన వారు ఇప్పుడు నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.

విజయవాడ: తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం పోరాడిన సీఎం చంద్రబాబుకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడం కుట్రలో భాగమేనని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఇన్నాళ్లూ అసలు కేసే లేదని చెప్పిన వారు ఇప్పుడు నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు చేసిన ఆందోళనపై ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు వారెంట్‌ జారీ చేయడం సమంజసం కాదన్నారు.

తెలంగాణ ఎడారి కాకూడదనే చంద్రబాబు అప్పట్లో ఆందోళన చేశారని ఎంపీ నాని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నందునే చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నిందని మండిపడ్డారు. 

ఆకుట్రలో ప్రధాని మోదీ, అమిత్‌ షా, కేసీఆర్, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రధాన సూత్రధారులని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలుగు ప్రజలంతా చంద్రబాబు వెంటే ఉన్నారని చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేదని నాని వ్యాఖ్యానించారు.

మరోవైపు ఐరాస సమావేశానికి సీఎం ,చంద్రబాబు నాయుడు హాజరుకావడం మోదీకి ఇష్టం లేదని నాని ఆరోపించారు. బీజేపీ కుట్ర రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ లో కేసీఆర్ కుట్ర కూడా ఉందని దుయ్యబుట్టారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన వారి ఆటలు సాగవన్నారు. 

click me!