అందుకే ప్రజలు నీ సీటు మారుస్తున్నారు: చంద్రబాబుపై కన్నా వ్యాఖ్యలు

Published : May 02, 2019, 10:53 AM IST
అందుకే ప్రజలు నీ సీటు మారుస్తున్నారు: చంద్రబాబుపై కన్నా వ్యాఖ్యలు

సారాంశం

మోదీ గంటకో డ్రెస్ మారుస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఒకే డ్రెస్ తో ఉంటున్నారని చెప్పుకొచ్చారు. డ్రెస్ లపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. చంద్రబాబు వ్యాఖ్యలపై కన్నా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మోదీ గారు గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదుగానీ నువ్వు మాత్రం ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మారుస్తావ్ అంటూ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు.

గుంటూరు: ప్రధాని నరేంద్రమోదీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రధాని నరేంద్రమోదీకి  డ్రెస్ పిచ్చి అని ఆయన గంటకో డ్రెస్ మారుస్తారని చంద్రబాబు బుధవారం విమర్శించారు. 

మోదీ గంటకో డ్రెస్ మారుస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఒకే డ్రెస్ తో ఉంటున్నారని చెప్పుకొచ్చారు. డ్రెస్ లపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. చంద్రబాబు వ్యాఖ్యలపై కన్నా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. 

మోదీ గారు గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదుగానీ నువ్వు మాత్రం ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మారుస్తావ్ అంటూ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. నిమిషానికి ఒక మాట మారుస్తావ్. 

నిజాయితీగా ఉండే అధికారుల సీటు మారుస్తావ్. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాళ్ల పార్టీ మారుస్తావ్ అంటూ విరుచుకుపడ్డారు. అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో నీ సీటు మారుస్తారంటూ సెటైర్లు వేశారు కన్నా లక్ష్మీనారాయణ.    

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Birthday: అన్నా క్యాంటీన్ లో సీఎం చంద్రబాబు బర్త్ డే పార్టీ | Anna Canteen
Home Minister Anitha:సింహాచలేశుని Chandanotsavamలో హోం మంత్రి వంగలపూడి అనిత | Asianet News Telugu