ముంచుకొస్తున్న ఫణి తుఫాను... ఉత్తరాంధ్రపై అధిక ప్రభావం

By telugu teamFirst Published May 2, 2019, 10:20 AM IST
Highlights

బంగాళాఖాతంలో ఫణి తుఫాను అలజడి సృష్టిస్తోంది. మరో రెండు రోజుల్లో తుఫాను తీరానికి చేరనుంది. కాగా... ఈ క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  

బంగాళాఖాతంలో ఫణి తుఫాను అలజడి సృష్టిస్తోంది. మరో రెండు రోజుల్లో తుఫాను తీరానికి చేరనుంది. కాగా... ఈ క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  కాగా..ఈ వర్షాల ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో పెనుగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు స్పష్టంచేశారు.

ప్రస్తుతం విశాఖ తీరానికి 235 కిలోమీటర్ల దూరంలో, బెంగాల్‌లోని దిగాకు 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విజయనగరం జిల్లాకు కాస్త దగ్గరగా, శ్రీకాకుళం జిల్లాకు కేవలం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచే ఒడిశా వైపుగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు భారీ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

బుధవారం సాయంత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర ఈశాన్య దిశగా తుపాను మలుపుతీసుకుంది. ప్రస్తుతం ఈశాన్య  దిశలోనే కదులుతూ గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. రేపు మధ్యాహ్నం పూరీకి సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వరకు ప్రచండగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖలు తెలిపారు. 

click me!