పరారీలో మురళీమోహన్-సుజనా, 23 తర్వాత చాలామంది అజ్ఞాతంలోకి: విజయసాయి

Published : May 02, 2019, 10:33 AM IST
పరారీలో మురళీమోహన్-సుజనా, 23 తర్వాత చాలామంది అజ్ఞాతంలోకి: విజయసాయి

సారాంశం

ఇటీవలే హైదరాబాద్ నుంచి కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయి, రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ పరారీ ఉన్నాడా?  అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారని తెలిపారు. ఇంకో ఎంపీ సుజనా చౌదరి సిబిఐ కళ్లుగప్పి తిరుగుతున్నాడని విమర్శించారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది ఎంపీలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సెటైర్లు వేశారు. 

మే 23 తర్వాత మరింతమంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్లడం ఖాయమన్నారు. ఇటీవలే హైదరాబాద్ నుంచి కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయి, రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ పరారీ ఉన్నాడా?  అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 

పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారని తెలిపారు. ఇంకో ఎంపీ సుజనా చౌదరి సిబిఐ కళ్లుగప్పి తిరుగుతున్నాడని విమర్శించారు. మే 23 తర్వాత ఇంకెంత మంది అజ్ణాతంలోకి వెళ్తారో?అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu