ఏసీబీ సిఫారసు: విజయవాడ దుర్గగుడిలో తొమ్మిది మంది ఉద్యోగులపై చర్యలు

By narsimha lodeFirst Published Nov 30, 2022, 11:52 AM IST
Highlights

ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో  ఏసీబీ సిఫారసు మేరకు 9 మందిపై  ఈవో భ్రమరాంబ చర్యలు తీసుకున్నారు. మిగిలిన  ఆరుగురు ఉద్యోగులపై  చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. 

విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో  ఏసీబీ కేసుల్లో ఆరోపణలు  ఎదుర్కొంటున్న 15  మంది ఉద్యోగుల్లో తొమ్మిది మందిపై  ఈవో  భ్రమరాంబ  బుధవారం నాడు చర్యలు తీసుకొన్నారు.. అయితే  ఆరుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకోకపోవడంపై  పలువురు అభ్యంతరం  వ్యక్తం  చేస్తున్నారు.

విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో ఏసీబీ అధికారులు విచారణ నిర్వహించి 15 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది.ఈ సిఫారసు మేరకు 15  మంది ఉద్యోగులపై  దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకొన్నారు.అయితే  దేవాదాయ శాఖ ఉద్యోగులు  కోర్టులను ఆశ్రయించారు. మరికొందరు  రాజకీయ నేతల అండతో  తిరిగి విధుల్లోకి  చేరారు.  విధుల నుండి తప్పించిన  రెండు మూడు మాసాలకే ఉద్యోగులు తిరిగి  విధుల్లో  చేరారు. దీనిపై ఏసీబీ అధికారులు  అభ్యంతరం  వ్యక్తం  చేశారు. అంతేకాదు  ఈ విషయమై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ కోరింది ఏసీబీ..అయితే  ఆరోపణలు ఎదుర్కొంటున్న  ఉద్యోగులు  ఏకంగా  విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలోనే తిరిగి  ఇటీవలనే విధుల్లో  చేరారు. దీన్ని ఏసీబీ సీరియస్ గా తీసుకుంది.గత  నెలలో  ఈ విషయమై  చర్యలకు ఏసీబీ దేవాదాయశాఖకు లేఖ రాసింది. ఈ  విషయాన్ని దేవాదాయ శాఖ  కూడా సీరియస్‌గా తీసుకుంది.  15 మంది ఉద్యోగుల్లో  తొమ్మిది మంది ఉద్యోగులపై  ఇంద్రకీలాద్రి ఆలయ ఈఓ  భ్రమరాంబ చర్యలు తీసుకున్నారు. 

ఈ తొమ్మిది  మంది  ఉద్యోగులపై  ఏడాది ఇంక్రిమెంట్ ను కట్  చేసింది. ప్రమోషన్లను రద్దు చేయడంతో పాటు  జరిమానాను విధిస్తూ ఈవో  నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన ఆరుగురు ఉద్యోగులతో  ఆలయ ఆదాయానికి ఎలాంటి నష్టం లేదని ఈవో తేల్చింది. అయితే  9 మంది  ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంపై విమర్శలు కూడా లేకపోలేదు. 

ఆలయంలోని  శానిటేషన్,  సెక్యూరిటీ, స్క్రాప్  టెండర్లలో అవకతవకలు చోటు  చేసుకొన్నాయని ఏసీబీ నివేదిక తెలిపింది. లడ్డూ, టికెట్, చీరల కేశఖండన, ఇంజనీరింగ్  విభాగాల్లో అవినీతిపై తన నివేదికలో  ఏసీబీ ప్రస్తావించింది.  ఈ  నివేదిక ఆధారంగా  ఈ  15  మంది ఉద్యోగులపై దేవాదాయశాఖ ఏడాది క్రితం  చర్యలు తీసుకొన్న విషయం తెలిసిందే. 
 

click me!