కాకినాడ జిల్లాకు చెందిన టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. నిందితుడి ఆచూకీని చెబితే రూ. 20 వేల రివార్డును ప్రకటించారు పోలీసులు.
కాకినాడ: జిల్లాకు చెందిన టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం చేసిన నిందితుడి ఆచూకీ చెబితే రూ. 20 వేల రివార్డును పోలీసు శాఖ ప్రకటించింది. మరో వైపు నిందితుడి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఈ ఘటన వెనుక నిందితులను బయటపెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
నిన్న ఉదయం టీడీపీ నేత శేషగిరిరావుపై భవానీ మాలలో వచ్చిన ఓ దుండగుడు శేషగిరిరావుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ దాడిలో గాయపడిన శేషగిరిరావును కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శేషగిరిరావును మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప తదితర టీడీపీ నేతలు నిన్న పరామర్శించారు.ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. తనను హత్య చేసేందుకు వైసీపీ నేతలు కుట్రపన్నుతున్నారని టీడీపీ నేత శేషగిరిరావు గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీస్ శాఖ నుండి సరైన స్పందన లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2020 మే మాసంలో యనమల కృష్ణుడితో కలిసి శేషగిరిరావు ఈ మేరకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించి ఉంటే నిన్న హత్యాయత్నం జరిగి ఉండేది కాదనే అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
undefined
also read:తునిలో టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం: ఆసుపత్రికి తరలింపు
శేషగిరిరావుపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడి ఫోటోను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపితే రూ. 20 వేల రివార్డును ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. నిందితుడు బైక్ పై వెళ్తున్న ఫోటోను పోలీసులు పలు పోలీస్ స్టేషన్లకు పంపారు. శేషగిరిరావుపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగుడి వెనుక అధికారపార్టీకి చెందిన నేతల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరో వైపు ఈ కేసు దర్యాప్తును పెద్దాపురం డీఎస్పీ కి అప్పగించారు పోలీసు ఉన్నతాధికారులు.