గూడూరు సమీపంలో నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు..

Published : Nov 18, 2022, 08:42 AM IST
గూడూరు సమీపంలో నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు..

సారాంశం

తిరుపతి జిల్లా గూడురు జంక్షన్ సమీపంలో నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. అహ్మాదాబాద్ నుంచి చెన్నై వైపు వెడుతున్న ట్రైన్ లో ఈ ప్రమాదం జరిగింది. 

తిరుపతి : నవజీవన్ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. గూడూరు జంక్షన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వైపు వెళుతున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ లోని పాంట్రీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది... గూడూరు రైల్వే స్టేషన్ లో రైలు ఆపి  మంటలను అదుపులోకి  తెచ్చారు.  

ఈ ప్రమాదం  కారణంగా..  గంట పాటు  గూడురు రైల్వే స్టేషన్ లోనే రైలు నిలిచిపోయింది. అయితే ప్రమాదం కారణంగా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై అధికారుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు