ఆత్మహత్యాయత్నం చేసిన కోడల్ని కాపాడబోయి అత్త మృతి..గూడూరులో విషాదం..

Published : Nov 18, 2022, 08:53 AM IST
ఆత్మహత్యాయత్నం చేసిన కోడల్ని కాపాడబోయి అత్త మృతి..గూడూరులో విషాదం..

సారాంశం

ఆత్మహత్యాయత్నం చేసిన కోడలిని కాపాడబోయిన ఓ అత్త రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన గూడూరులో విషాదాన్ని నింపింది. 

గూడూరు : ఆత్మహత్యకు పాల్పడ్డ కోడలిని కాపాడేందుకు తీసుకువెళుతూ.. ప్రమాదం బారిన పడి మృతి చెందిన ఘటన పెద్దపాడు సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గూడూరు పట్టణానికి చెందిన తెలుగు మౌనిక గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం గమనించిన ఆమె అత్త ఉన్నూరమ్మ (45).. స్థానికుడు పరశురాముడు సహాయంతో పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించింది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ద్విచక్రవాహనం మీద మౌనికను తీసుకుని హుటాహుటిన కర్నూలుకు బయలుదేరారు. 

అయితే, వీరి వాహనం పెదపాడు వంతెనకు సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ముగ్గురికీ చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఉన్నూరమ్మ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కె.నాగలాపురం ఎస్సై సోమ్లా నాయక్ తెలిపారు. 

గూడూరు సమీపంలో నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు..

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ లో మహారాష్ట్రలో ఓ ఘటన షాకింగ్ కి గురి చేసింది. కోడళ్లను అత్తలు రాచిరంపాన పెట్టడం ఓల్డ్ ట్రెండ్.. అత్తలనే కోడళ్లు హింసించడం న్యూ ట్రెండ్.. దీన్నే ఫాలో అయింది ఓ కోడలు. మహారాష్ట్రలోని ఠాణె జిల్లా అమర్నాథ్ కు చెందిన ఓ ఇంట్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమని అడిగిన అత్త చేతి వేళ్లను విరిచేసింది ఓ కోడలు.. వివరాల్లోకి వెళితే అత్త వృశాలీ కులకర్ణి (60) పూజ చేసుకుంటూ ఉండగా హాలులో ఉన్న కోడలు విజయ (32) టీవీ చూస్తోంది. సౌండ్ తో పూజకు అంతరాయం కలుగుతోందని, టీవీ బంద్ చేయమని అంతా కేకేసింది.

కోడలు ఆ మాటలు పెడచెవిన పెట్టి వ్యాల్యూం ఇంకా పెంచింది. కోపం పట్టలేక అత్త నేరుగా వచ్చి టీవీ బంద్ చేసింది. దీంతో కోడలు మరింత రెచ్చిపోయింది. తగ్గేదే లేదు అన్నట్లు ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. అత్త వేలు చూపించి మాట్లాడడంతో ఆమె చేతి వేళ్లను విరిచేసింది. ఇద్దరికీ సర్ధి చెబుదామని ఇంటి లోపలి నుంచి సౌరవ్ రాగా.. భార్య విజయ చేతికి చేతిలో అతనికీ దెబ్బలు తప్పలేదు. మూడు వేళ్లు విరిగిన అత్త శివాజీనగర్ ఠాణాలో కోడలిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

కాగా, సెప్టెంబర్ 20న ఢిల్లీలో వెలుగుచూసిన మరో ఘటనలో ప్రియుడితో కలిసి కుట్ర పన్నిన ఓ మహిళ తన సొంత అత్తమామల నగ్న వీడియోలు తీసింది.  ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిబంగారు ఆభరణాల వ్యాపారి. అతనికి తన భార్యతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వారిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. భార్యకు తన స్నేహితుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త ఇటీవల గుర్తించాడు. బండారం బయటపడడంతో ఇంట్లో ఉన్న కోటి రూపాయలకుపైగా విలువైన ఆభరణాలు, కొంత నగదు తీసుకుని ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. 

దీంతో ఇది గుర్తించిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ విషయం భార్యకు తెలియడంతో ఆమె భర్త కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగింది. తమ ఇంట్లో అత్తామామల గదిలో రహస్య కెమెరాలు పెట్టానని.. వారు ఏకాంతంగా ఉన్నప్పుడు వారిని వీడియోలు తీసానని.. షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. తనపై కేసులు వెనక్కి తీసుకోకపోతే ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ భర్తను బెదిరించింది. దీంతో ఈ విషయాన్ని కూడా భర్త పోలీసులకు తెలిపాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు