కాకినాడ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 6, 2024, 9:36 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం తర్వాత ప్రశాంతమైన , అందమైన నగరం కాకినాడ. ఈ నగరానికి ఒక్కసారి వెళితే చాలు.. అక్కడే శాశ్వతంగా వుండిపోవాలని అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. తీర , మెట్ట ప్రాంతాల కలయికతో కూడిన ఈ నియోజకవర్గం ఎంతోమంది దిగ్గజ నేతలను దేశానికి అందించింది. ఈ లోక్‌సభ పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలు జనరల్ స్థానాలు కావడం కాకినాడ స్పెషాలిటీ. కాపు సామాజిక వర్గానిది డామినేషన్ కావడంతో .. ఈ వర్గానికే అన్ని పార్టీలు టికెట్లు కేటాయిస్తూ వుంటాయి. 1952లో ఏర్పాటైన కాకినాడ లోక్‌సభ పరిధిలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం శాసనసభ స్థానాలున్నాయి.

పచ్చని పంట పొలాలు, ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు, గంభీరమైన సముద్ర తీరంతో కాకినాడ అలరారుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం తర్వాత ప్రశాంతమైన , అందమైన నగరం కాకినాడ. ఈ నగరానికి ఒక్కసారి వెళితే చాలు.. అక్కడే శాశ్వతంగా వుండిపోవాలని అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. తూర్పు గోదావరి జిల్లాకు రాజధానిగా, వర్తక, వాణిజ్యాలకు కేంద్రంగా అలరారుతోన్న కాకినాడ.. రాజకీయాలకు కూడా పెట్టింది పేరు. 

కాకినాడ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. కాపులదే ఆధిపత్యం :

తీర , మెట్ట ప్రాంతాల కలయికతో కూడిన ఈ నియోజకవర్గం ఎంతోమంది దిగ్గజ నేతలను దేశానికి అందించింది. ఈ లోక్‌సభ పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలు జనరల్ స్థానాలు కావడం కాకినాడ స్పెషాలిటీ. కాపు సామాజిక వర్గానిది డామినేషన్ కావడంతో .. ఈ వర్గానికే అన్ని పార్టీలు టికెట్లు కేటాయిస్తూ వుంటాయి. కాకినాడ నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన మల్లిపూడి రామసంజీవరావు, ఆయన కుమారుడు పళ్లంరాజు, బీజేపీ నుంచి విజయం సాధించిన కృష్ణంరాజులు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. 

1952లో ఏర్పాటైన కాకినాడ లోక్‌సభ పరిధిలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం శాసనసభ స్థానాలున్నాయి. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దాపురం మినిహాయించి మిగిలిన ఆరు స్థానాల్లోనూ వైసీపీ గెలిచింది. కాకినాడ లోక్‌సభలో కాంగ్రెస్ 10 సార్లు , టీడీపీ 5 సార్లు, బీజేపీ, సీపీఐ, వైసీపీ ఒక్కోసారి విజయం సాధించాయి.

కాకినాడలో మొత్తం ఓటర్లు 15,63,930 మంది.. వీరిలో పురుష ఓటర్లు 7,87,676 మంది.. మహిళా ఓటర్లు 7,76,029 మంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి వంగా గీతకు 5,37,630 ఓట్లు .. టీడీపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్‌కు 5,11,892 ఓట్లు..జనసేన అభ్యర్ధి జ్యోతుల వెంకటేశ్వరరావుకు 1,32,648 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ 25,738 ఓట్ల మెజారిటీతో కాకినాడను కైవసం చేసుకుంది. 

కాకినాడ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. బరిలో వుండేదెవరు : 

2024 లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే.. సిట్టింగ్ ఎంపీ వంగా గీతను వైసీపీ అధిష్టానం పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో దింపింది.  ఎంపీ అభ్యర్ధిగా చలమలశెట్టి సునీల్‌ను జగన్ ప్రకటించారు. ఆయన ఇప్పటికే వైసీపీ, టీడీపీల నుంచి పోటీ చేసి ఓటమిపాలై మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. జనసేనతో పొత్తు కుదరడంతో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు .. కాకినాడ నుంచి బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. నర్సాపురం, అనకాపల్లి ఎంపీ స్థానాలు కూడా నాగబాబు కోసం పరిశీలనలో వున్నాయి. ఒకవేళ బీజేపీ కనుక టీడీపీ జనసేన కూటమితో కలిస్తే కాకినాడను కోరే ఛాన్స్ వుంది. గతంలో ఇక్కడ గెలిచిన ట్రాక్ రికార్డు వుండటంతో కమలనాథులు కాకినాడలో అభ్యర్ధిని బరిలో దింపవచ్చు. 

click me!