
చిలకలూరిపేట రాజకీయాలు :
చిలకలూరిపేటపై తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. అయితే ఇదే టిడిపి నుండి రాజకీయ నాయకురాలి ఎదిగిన విడదల రజని వైసిపిలో చేరడంతో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన రాజకీయ గురువుగా చెప్పుకున్న ప్రత్తిపాటి పుల్లారావుపై పోటీ చేసారు రజని. ఇలా గురుశిష్యుల మధ్య సాగిన పోరులో శిష్యురాలిదే పైచేయిగా నిలిచింది. చిలకలూరిపేట నుండి మూడుసార్లు ఎమ్మెల్యే, అప్పటి మంత్రి పుల్లారావును ఓడించి నియోజకవర్గంలో మొదటిసారి వైసిపి జెండా ఎగరేసారు విడదల రజని. ఇలా మంత్రిని ఓడించిన రజనికి వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రిపదవి దక్కింది.
చిలకలూరిపేట అసెంబ్లీలోని మండలాలు :
చిలకలూరిపేట
నాదెండ్ల
ఎడ్లపాడు
చిలకలూరిపేట అసెంబ్లీ ఓటర్లు :
చిలకలూరిపేటలో మొత్తం ఓటర్ల సంఖ్య - 223976
పురుషులు - 107815
మహిళలు - 116125
చిలకలూరిపేట అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
చిలకలూరిపేట వైసిపి అభ్యర్థి :
చిలకలూరిపేటలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే విడదల రజనిని కాదని మరో నేత మల్లెల రాజేష్ నాయుడును బరిలోకి దింపుతోంది వైసిపి. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు.
చిలకలూరిపేట టిడిపి అభ్యర్థి :
చిలకలూరిపేట నుండి మూడుసార్లు (1999, 2009,2014) ప్రాతినిధ్యం వహించిన ప్రత్తిపాటి పుల్లారావుకే టిడిపి టికెట్ దక్కింది.2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా మరోసారి ఆయనకే అవకాశం ఇచ్చింది టిడిపి.
చిలకలూరిపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
చిలకలూరిపేట ఎన్నికల ఫలితాలు 2019 :
నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో 1,93,340 (86 శాతం) ఓట్లు పోలయ్యాయి.
వైసిపి - విడదల రజని - 94,430 (50 శాతం) - 8,301 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - ప్రత్తిపాటి పుల్లారావు - 86,129 (45 శాతం) - ఓటమి
జనసేన - నాగేశ్వరరావు గాదె - 2,958 (1 శాతం)
చిలకలూరిపేట ఎన్నికల ఫలితాలు 2014 :
నియోజకవర్గంలో మొత్తం ఓట్లలో 1,73,730 ఓట్లు పోలయ్యాయి.
టిడిపి - ప్రత్తిపాటి పుల్లారావు - 89,591 (51 శాతం) - 10,684 ఓట్ల ఆధిక్యంతో విజయం
వైసిపి - మర్రి రాజశేఖర్ - 78,907 (45 శాతం) _ ఓటమి