ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. కాగా, రేపు ఢిల్లీలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. గురువారం ఆయన హస్తినకు బయల్దేరి వెళ్లుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి ఢిల్లీలో చంద్రబాబు నాయుడు కీలక మంతనాలు జరుపుతారని తెలిసింది. ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు నాయుడు గంటన్నరపాటు భేటీ అయ్యారు. దీంతో రేపు ఆయన ఢిల్లీ పర్యటనలో ఏం చేస్తారనేది ఉత్కంఠగా మారింది.
Also Read: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సినీ దర్శకుడు బీ నర్సింగరావు బహిరంగ లేఖ
మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లుతున్నారు. తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏఐసీసీ నాయకులతో ఆయన చర్చించనున్నారు. రేపు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉన్నది. ఇప్పటికే దాదాపు అభ్యర్థులు ఖరారు చేశారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశం తర్వాత పది మందితో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నది. ఆ తర్వాత మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన అభ్యర్థులను కూడా ప్రకటించవచ్చు.