గూగుల్ లో లోపం.. కనిపెట్టిన కడప విద్యార్థి

First Published 25, May 2018, 2:28 PM IST
Highlights

ప్రైజ్ మనీ పంపిన గూగుల్

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ గురించి తెలియని వాళ్లు ఉండరు. ప్రపంచంలో ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా.. అందరూ గూగుల్ లోనే సెర్చ్ చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు  పొందిన సంస్థ గూగుల్. అలాంటి గూగుల్ లో ఓ లోపాన్ని కనిపెట్టాడు కడప జిల్లా కుర్రాడు. 

గోపాల్ సింగ్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి గూగుల్ లో లోపాన్ని కనిపెట్టి.. దానికి సదరు సంస్థకు తెలియజేశాడు.  తప్పును తమకు వెంటనే తెలియజేసినందుకు గూగుల్‌ యాజమాన్యం ప్రత్యేక సమావేశం నిర్వహించి గోపాల్‌సింగ్‌ను అభినందించింది.  అంతేకాదు గూగుల్‌ ప్రతినిధులు ఆయనకు 3133.70 డాలర్లు (రూ. 2.10 లక్షలు) నగదును బహుమతిగా ప్రకటించారు. 

ఈ లోపం ద్వారా గూగుల్‌తో పాటు ఆ సంస్థతో టైఅప్‌ అయిన కంపెనీల రహస్యాలను ఇతరులు చౌర్యం చేసే ప్రమాదం ఉందని, దాన్ని తాను గుర్తించి గూగుల్‌కు తెలియజేసినట్లు గోపాల్‌సింగ్‌ తెలిపారు.  గోపాల్ ..స్థానిక కేఎస్‌ఆర్‌ఎం  ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.
 

Last Updated 25, May 2018, 2:28 PM IST