దిగిరాని చంద్రబాబు ప్రభుత్వం : దీక్షకు సిద్దమైన పవన్ కళ్యాణ్

First Published May 25, 2018, 12:47 PM IST
Highlights

ప్రభుత్వానికి ఇచ్చిన 48 గంటల సమయం ముగియడంతో దీక్షకు సిద్దమైతున్న పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మాటలకు కట్టుబడి నిరాహార దీక్ష కు సిద్దమయ్యారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో బాగంగా పవన్ ప్రసంగిస్తూ...48 గంటల్లో హెల్త్ మినిస్టర్ ను నియమించాలని, లేదంటే తాను నిరాహాదీక్షకు దిగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ డిమాండ్ ను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోకుండా ఆరోగ్య మంత్రి నియామకాన్ని చేపట్టకపోవడంతో పవన్ నిరాహార దీక్ష కు సిద్దమయ్యారు. ఈ దీక్షకు సంబందించి ఆయన జనసేన నేతలతో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. 

శ్రీకాకుళం జిల్లా పలాసలో రోడ్ షో లో పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ సమస్య గురించి ప్రసంగించారు. బాధితులు తమ గోడును చెప్పుకోడానికి ఓ ఆరోగ్య మంత్రి కూడా లేకపోవడం సిగ్గుచేటని మండిపడిన విషయం తెలిసిందే. ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం దొరికే వరకు బాధితులకు తాను అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు. వీరి సమస్యలు పరిష్కరించడానికి తన పర్యటన ముగిపేలోపు ఆరోగ్య మంత్రిని నియమించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించోకోకపోవడంతో పవన్ దీక్షకు సిద్దమయ్యారు.

ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్ఱభుత్వాలకు విభేదాలు రావడంతో అప్పటివరకు కలిసి వున్న బిజెపి, టిడిపి పార్టీలు వేరుపడ్డాయి. దీంతో బిజెపి పార్టీ నుండి ఆరోగ్యమంత్రిగా వున్న కామినేని శ్రీనివాస్, దేవాదాయ మంత్రిగా వున్న పైడికొండల మాణిక్యాల రావు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అప్పటినుండి ఈ రెండు శాఖలు ఖాళీగా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య శాఖా మంత్రిని వెంటనే నియమించాలని పవన్ కోరుతున్నారు. దీనికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదు.

ఇక పవన్ శ్రీకాకుళంలో చేపట్టిన పోరాట యాత్ర ముగిసినప్పటికి ఆయన డిమాండ్ మాత్రం నెరవేరలేదు. దీంతో జనసేన నేతలతో చర్చించిన పవన్ కళ్యాణ్ దీక్షకు సిద్దమైతున్నట్లు సమాచారం.
 

click me!