అక్బర్ పాషా కుటుంబాన్ని కాపాడిన కడప పోలీసులు..

By AN TeluguFirst Published Sep 11, 2021, 3:21 PM IST
Highlights

ఈ వీడియోను గమనించిన స్పెషల్ బ్రాంచ్ విభాగంలోని సోషల్ మీడియా మోనిటరింగ్ సెల్ సిబ్బంది జిల్లా ఎస్.పి 'సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన దువ్వూరు ఎస్.ఐ, చాగలమర్రి పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి కేవలం 20 నిమిషాల్లో చాగలమర్రిలో నివాసం ఉండే ఫిర్యాది మిద్దె అక్బర్ బాషా ఇంటికి చేరుకొని అతనితో మాట్లాడి జిల్లా ఎస్.పి వద్దకు తీసుకెళతామని చెప్పడంతో అక్బర్ కుటుంబ సభ్యులు శాంతించారు. 

కడప జిల్లా : దువ్వూరు మండలం ఎర్రబెల్లి పంచాయతీ మాచానా పల్లికి  చెందిన భూమికి సంబంధించి ‘స్పందన’లో ఇచ్చిన ఫిర్యాదుపై మైదుకూరు రూరల్ సి.ఐ కొండారెడ్డి తనకు అన్యాయం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 

తాను నివాసముంటున్న చాగలమర్రిలో సోషల్ మీడియా వేదికగా 10న శుక్రవారం రాత్రి 11 గంటలకు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం ప్రకటన చేసింది. భూ తగాదా విషయంలో ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నట్లు మైదుకూరు రూరల్ సి.ఐ పై ఫిర్యాది మిద్దె అక్బర్ బాషా కుటుంబం ఆరోపించింది. సి.ఐ తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదనతో తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వారు చేసిన లైవ్ వీడియో వైరల్ అయ్యింది. 

ఈ వీడియోను గమనించిన స్పెషల్ బ్రాంచ్ విభాగంలోని సోషల్ మీడియా మోనిటరింగ్ సెల్ సిబ్బంది.. జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్, ఐ.పి.ఎస్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.  తక్షణం జిల్లా ఎస్.పి సంబంధిత దువ్వూరు ఎస్.ఐ కె.సి రాజుకు వెంటనే బాధిత వ్యక్తి ఇంటివద్దకు వెళ్లాలని ఎస్.పి ఆదేశించారు.

వెంటనే రంగంలోకి దిగిన దువ్వూరు ఎస్.ఐ, చాగలమర్రి పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి కేవలం 20 నిమిషాల్లో చాగలమర్రిలో నివాసం ఉండే ఫిర్యాది మిద్దె అక్బర్ బాషా ఇంటికి చేరుకొని అతనితో మాట్లాడి జిల్లా ఎస్.పి వద్దకు తీసుకెళతామని చెప్పడంతో అక్బర్ కుటుంబ సభ్యులు శాంతించారు. 

మిద్దె అక్బర్ బాషా శనివారం ఉదయం 11 గంటలకు జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో కలిశారు. జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ తక్షణం స్పందించి తనకు న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడం ఆనందంగా ఉందని, జిల్లా ఎస్.పి తమ కుటుంబాన్ని నిలబెట్టారని,  పోలీసులు మా ఇంటి వద్దకు వచ్చి న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడం వల్ల ఆత్మహత్యా యత్నం విరమించుకుంటున్నామని అక్బర్ తెలిపారు. 
 
మైదుకూరు రూరల్ సి.ఐ పై ఆరోపణలను అదనపు ఎస్.పి (ఆపరేషన్స్) దేవ ప్రసాద్ ను విచారణాధికారిగా నియమించినట్లు జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకూ మైదుకూరు రూరల్ సి.ఐ ని విధుల నుండి తప్పిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్.పి వివరించారు. 

‘ఆత్మహత్యే దిక్కు..’ వైసీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో... విరుచుకుపడ్డ నారా లోకేష్, చంద్రబాబు... (వీడియో)
           
రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర డి.జి.పి గారి ఆదేశాల మేరకు 'స్పందన' లో ఇచ్చే ఫిర్యాదులను నిర్ణీత సమయంలో విచారించి ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తామని ఎస్.పి తెలిపారు. అన్ని సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని. తమను నమ్ముకున్నవారికి అన్యాయం చేయోద్దని అన్బురాజన్ అన్నారు. ఆత్మహత్యతో మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాన్ని ఆవేదనకు గురిచేయడం భావ్యం కాదన్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని, డయల్ 100  లేదా తన ఫోన్ నెంబర్ 9440796900 కు ఫోన్ చేసి తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని ఎస్.పి పోలీసు శాఖ తరపున భరోసా ఇచ్చారు.  

తక్షణం రంగంలోకి దిగి కేవలం 20 నిమిషాల్లో సమయస్ఫూర్తితో కుటుంబంలోని నలుగురి ప్రాణాలు కాపాడిన దువ్వూరు ఎస్.ఐ కె.సి రాజు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రూరల్ సి.ఐ. ఎన్.రాజశేఖర్ రెడ్డి, వారి సిబ్బంది చాగలమర్రి కానిస్టేబుల్ కె. వెంకటేశ్వర్లు, హోం గార్డ్ మహమ్మద్ రఫీ లను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్.పి రివార్డులు అందచేశారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని నలుగురి నిండు ప్రాణాలు కాపాడడం అభినందనీయమని, పోలీసు శాఖ ఔన్నత్యాన్నిమరోమారు చాటారని జిల్లా ఎస్.పి కొనియాడారు.

click me!