వాక్సీనేషన్ వేసిన అధికారులకు పంచాయితీ సెక్రటరీ విషయం తెలియజేయగా ఎఎన్ఎమ్ లు వచ్చి శుక్రవారం ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గుంటూరు జిల్లా, మంగళగిరి, చినకాకాని గ్రామంలో గండికోట మల్లికార్జున రావు (58) అనే వ్యక్తి మృతి చెందాడు. కరోనా వాక్సిన్ వికటించడం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. గురువారం సాయంత్రం వాక్సిన్ వేసిన అనంతరం అస్వస్థత గురయ్యాడని అంటున్నారు.
వాక్సీనేషన్ వేసిన అధికారులకు పంచాయితీ సెక్రటరీ విషయం తెలియజేయగా ఎఎన్ఎమ్ లు వచ్చి శుక్రవారం ఉదయం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో మరణించాడు.
ఒంట్లో షుగర్ అధిక మోతాదులో ఉంది వాక్సిన్ వద్దన్నా.. కూడా ఫించన్ తీసేస్తామని పంచాయతీ కార్యదర్శి బెదిరించి వాక్సిన్ వేయించాడని.. మా నాన్న మృతికి అధికారులే కారణం అంటున్న కుటుంబ సభ్యులు.