అలా చేయలేకపోతే పవన్ కల్యాణ్‌‌కు రూ. 1,000 కోట్లు ఇస్తాను: కేఏ పాల్

Published : Jun 07, 2022, 03:10 PM IST
అలా చేయలేకపోతే పవన్ కల్యాణ్‌‌కు రూ. 1,000 కోట్లు ఇస్తాను: కేఏ పాల్

సారాంశం

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ జనసేన‌ను వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానన్నారు. 

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ జనసేన‌ను వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానన్నారు. పవన్ కల్యాణ్‌ను ఎంపీగానో, ఎమ్మెల్యేగానో గెలిపించేలా చూస్తామని, పవన్‌ను గెలిపించుకోలేకపోని పక్షంలో రూ.1,000 కోట్ల ఇస్తానని కూడా చెప్పారు. పలు రాజకీయ పార్టీలతో పవన్‌ కల్యాణ్‌ పొత్తు పెట్టుకోవడంపై పాల్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా గెలవలేరని విమర్శించారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉంది ఆయన ప్రసంగంలో బైబిల్‌ను ఉటంకిస్తూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

పవన్ కల్యాణ్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడని విమర్శించారు. అసలు ఎమ్మెల్యే అవుతాడా అంటూ ప్రశ్నించారు. అవినీతి పార్టీలతో పొత్తులు పెట్టుకున్న అతిపెద్ద అవినీతి పరుడని ఆరోపించాడు. పవన్ కల్యాణ్ డ్యాన్స్‌లు చేసి.. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న పది లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చుతాడా అని ప్రశ్నించారు. 

వచ్చే ఎన్నికల కోసం ఏ రాజకీయ పార్టీతో ప్రజా శాంతి పార్టీ పొత్తు పెట్టుకోవడంలేదని కేఏ పాల్ స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలం చెందారని విమర్శించారు. చంద్రబాబు తన ఆస్తులను కాపాడుకునేందుకే తన కుమారుడు లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని కేఏ పాల్‌ ఆరోపించారు. జగన్ అవినీతి గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని.. ఆయన అవినీతి గురించి అందరికి తెలుసని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!