కోనసీమలోని 12 మండలాల రైతులు క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రైతులు తెలిపారు.
అమలాపురం: Konaseema లోని 12 మండలాల రైతులుcrop holiday ప్రకటించారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు క్రాప్ హలిడే నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని 12 మండలాల Farmers క్రాప్ హాలిడే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కోనసీమ Rythu parirakshna samithi ప్రకటించింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వాటిని పరిష్కరించలేదని రైతు పరిరక్షణ సమితి తెలిపింది.
ఈ విషయమై తాము కలెక్టర్ కు సమర్పించిన వినతిపత్రాలకు ఎలాంటి స్పందన రాలేదని సమితి నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించలేదని కూడా రైతులు గుర్తు చేస్తున్నారు. దీంతో ఖరీఫ్ సీజన్ లో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.ఎరువులు, విత్తనాల ధరలు కూడా పెరిగిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు.
undefined
పంట కాలువలు, డ్రైన్ల నిర్వహణ సక్రమంగా లేదన్నారు. వర్షాలు, తుఫానుల సీజన్ లో వరి పంట ముంపునకు గురై నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు క్వింటాల్ వరి ధాన్యం పండించాలంటే రూ. 2552 ఖర్చు అవుతుందన్నారు. కానీ తమకు రూ. 1910 ఇస్తున్నారని రైతులు చెప్పారు. ప్రతి క్వింటాల్ కి రూ. 650 నష్టపోతున్నట్టుగా రైతులు గుర్తు చేశారు.
కోనసీమలోని ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులు క్రాప్ హాలిడేను అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు మండలాలతో పాటు మరో 10 మండలాల రైతులు ఇవాళ జత కలిశారు. వరి సాగు గిట్టుబాటు కాకపోవడంతో 2011లో కోనసీమ రైతులు క్రాప్ హలిడే ప్రకటించారు. జాతీయ స్థాయిలోని 13 పార్టీల నేతలు అప్పట్లో స్వయంగా కోనసీమ జిల్లాలకు వచ్చి ఈ పరిస్థితిని పరిశీలించారు.