వాళ్లిద్దరూ తప్ప... మమతకు అందరూ సపోర్టే: చంద్రబాబు

Siva Kodati |  
Published : Feb 05, 2019, 09:02 AM IST
వాళ్లిద్దరూ తప్ప... మమతకు అందరూ సపోర్టే: చంద్రబాబు

సారాంశం

పశ్చిమబెంగాల్‌లో కేంద్రచర్యను జగన్, కేసీఆర్ తప్ప అందరూ ఖండించారన్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019పై ఆయన పార్టీ నేతలు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

పశ్చిమబెంగాల్‌లో కేంద్రచర్యను జగన్, కేసీఆర్ తప్ప అందరూ ఖండించారన్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019పై ఆయన పార్టీ నేతలు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రంట్ అని తిరిగిన కేసీఆర్.. బెంగాల్‌ ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధి గురించి మాట్లాడలేకే.. జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

జగన్‌కు ఉన్న కులపిచ్చి గురించి అందరికీ తెలుసన్నారు. అన్ని వర్గాల బాగు కోసమే ఫెడరేషన్లు పెట్టి ప్రోత్సహిస్తున్నమని సీఎం తెలిపారు. కేంద్రంపై మమతా బెనర్జీ పోరాటానికి మద్ధతు తెలిపిన చంద్రబాబు.. ఇవాళ మధ్యాహ్నం కోల్‌కతా వెళ్లి మమత దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు
YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై వైఎస్ జగన్ పంచ్ లు| Asianet News Telugu