జగన్ దొబ్బేసిన లక్ష కోట్లు ఇస్తే ఏపీ కష్టాలు తీరుతాయి : కేఏ పాల్

Published : Jan 30, 2019, 06:29 PM IST
జగన్ దొబ్బేసిన లక్ష కోట్లు ఇస్తే ఏపీ కష్టాలు తీరుతాయి : కేఏ పాల్

సారాంశం

తాను రాజకీయం కొత్తగా మొదలు పెట్టలేదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తన శిష్యుడని, మిత్రుడని పాల్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని పాల్ ధీమా వ్యక్తం చేశారు. 

హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. 

జగన్ దొబ్బేసిన లక్ష కోట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ కష్టాలు తీరతాయని కేఏ పాల్ సూచించారు. ఇప్పటికే ఏపీ కోసం తన జీవితం ఇచ్చేశానని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్‌ తనతో చర్చకు రావాలని పాల్ సవాల్ విసిరారు. 

తాను రాజకీయం కొత్తగా మొదలు పెట్టలేదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు తన శిష్యుడని, మిత్రుడని పాల్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని పాల్ ధీమా వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్