జగన్‌పై దాడి కేసు: కోర్టును సమయం కోరిన ఏపీ సర్కార్

By narsimha lodeFirst Published Jan 30, 2019, 6:23 PM IST
Highlights

వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై  ఏపీ హైకోర్టులో బుధవారం నాడు వాదనలు జరిగాయి

అమరావతి: వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై  ఏపీ హైకోర్టులో బుధవారం నాడు వాదనలు జరిగాయి.  ఈ విషయమై తమ వాదనను విన్పించేందుకు  మరింత సమయం కావాలని ఏపీ ప్రభుత్వం కోర్టును కోరింది. ఈ కేసు విచారణను ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది.

గత ఏడాది అక్టోబర్ మాసంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడి చేశారు. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని ఏపీ సర్కార్ హైకోర్టులో సవాల్ చేసింది.  ఈ విషయమై బుధవారం నాడు హైకోర్టులో వాదనలు జరిగాయి.

ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఎన్ఐఏకు కేసును అప్పగించడాన్ని ఏపీ సర్కార్  తప్పుబడుతోంది.   ఇదే విషయమై ఎన్ఐఏ విచారణను తక్షణమే నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు విన్పించారు. 

ఈ పిటిషన్‌పై ఎన్ఐఏ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. అయితే తమ వాదనను విన్పించేందుకు గాను మరింత సమయం కావాలని  ఏపీ సర్కార్  హైకోర్టును  ఇవాళ కోరింది. దీంతో ఈ కేసును ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.


 

click me!