జగన్ ఓదార్పుయాత్రపై ఆమంచి రాళ్లదాడి

By Nagaraju penumalaFirst Published Feb 15, 2019, 3:43 PM IST
Highlights

వైసీపీలో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుగుదేశంలో కాదని కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్ కి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. తెలుగుదేశం పార్టీలో టికెట్లు రావని తెలుసుకుని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని జూపూడి ఎద్దేవా చేశారు. 

అమరావతి: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు మండిపడ్డారు. గురువారం సీఎం చంద్రబాబు నాయుడుపై ఆమంచి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. చంద్రబాబుకు కులపిచ్చి అంటగట్టడం తగదని జూపూడి హితవు పలికారు. 

శుక్రవారం అమరావవతిలో మీడియాతో మాట్లాడిన జూపూడి తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓదార్పుయాత్రపై ఆమంచి రాళ్లదాడికి పాల్పడ్డారని జూపూడి ఆరోపించారు. ఆ విషయం అందరికీ తెలిసిందేనని అయితే ఇప్పుడు ఆ పార్టీలోకి చంద్రబాబును విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. 

జగన్‌కు రాజకీయాలు నేర్పేందుకే అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్ లు వైసీపీలో చేరినట్లు ఉందని జూపూడి అభిప్రాయ పడ్డారు. ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ దళిత వ్యతిరేకిగా వ్యవహరించారని ఆరోపించారు. దళిత ఎస్పీని ట్రాన్స్‌ఫర్‌ చేయించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 

click me!