నేను పీఆర్పీలోకి వెళ్లినప్పుడు చంద్రబాబును విమర్శించలేదు : అవంతి పై మంత్రి గంటా ఫైర్

Published : Feb 15, 2019, 03:22 PM IST
నేను పీఆర్పీలోకి వెళ్లినప్పుడు చంద్రబాబును విమర్శించలేదు : అవంతి పై మంత్రి గంటా ఫైర్

సారాంశం

తాను తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లే ముందు చంద్రబాబు నాయుడును ఒక్క మాట కూడా అనలేదని గుర్తు చేశారు. అవంతి కోసం భీమిలి నియోజకవర్గాన్ని సైతం వదులుకోవడానికి తాను సిద్ధపడ్డానని చెప్పుకొచ్చారు. అయినా అవంతి పార్టీ వీడారని వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆయన పార్టీ వీడారని మంత్రి గంటా శ్రీనివాస్ ఆరోపించారు. 

రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ పై ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన గంటా పార్టీ వీడిన తర్వాత అవంటి శ్రీనివాస్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. 

అవంతి వ్యాఖ్యలను ప్రజలు హర్షించరన్నారు. ఒకప్పుడు చంద్రబాబు కాపు మిత్ర అని అవంతి శ్రీనివాస్ పొగిడారని అలాంటి వ్యక్తి చంద్రబాబు కాపు వ్యతిరేకిగా మాట్లాడటాన్ని ఖండించారు. 

తాను తెలుగుదేశం పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లే ముందు చంద్రబాబు నాయుడును ఒక్క మాట కూడా అనలేదని గుర్తు చేశారు. అవంతి కోసం భీమిలి నియోజకవర్గాన్ని సైతం వదులుకోవడానికి తాను సిద్ధపడ్డానని చెప్పుకొచ్చారు. అయినా అవంతి పార్టీ వీడారని వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆయన పార్టీ వీడారని మంత్రి గంటా శ్రీనివాస్ ఆరోపించారు. 
 
PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu