పొత్తులు ఉంటాయ్, 30 రోజుల ముందు ప్రకటిస్తాం: నారా లోకేష్

Published : Feb 15, 2019, 02:51 PM ISTUpdated : Feb 15, 2019, 02:59 PM IST
పొత్తులు ఉంటాయ్, 30 రోజుల ముందు ప్రకటిస్తాం: నారా లోకేష్

సారాంశం

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 150 స్థానాల్లో గెలుపొందండ తథ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని తేల్చి చెప్పారు. ఎన్నికలకు 30 రోజుల ముందు పొత్తులపై చంద్రబాబు కచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని లోకేష్ స్పష్టం చేశారు. 

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్‌ దొంగబ్బాయి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ డ్రామా కంపెనీగా అభివర్ణించారు. 

కృష్ణాజిల్లాలో మీడియాతో మాట్లాడిన లోకేష్ ఏపీలో వైఎస్ జగన్ నాలుగు డ్రామాలు ఆడారని గుర్తు చేశారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఒక డ్రామా అయితే కోడికత్తి మరో డ్రామా కంపెనీ అన్నారు. ఇకనోతే ఆవు అంబులెన్స్ అనేది మూడో డ్రామా అయితే ఎక్కడ లేని హామీలు ఇస్తూ మరో డ్రామాకు తెరలేపారంటూ విరుచుకుపడ్డారు. 

తెలుగుదేశం పార్టీని వీడుతున్న వాళ్లంతా రాబోయే ఎన్నికల్లో టికెట్లు రాని వాళ్లేనని లోకేష్ ఆరోపించారు. గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరి పనితీరు ఏంటో చంద్రబాబుకు తెలుసునని చెప్పుకొచ్చారు. 

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 150 స్థానాల్లో గెలుపొందండ తథ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని తేల్చి చెప్పారు. ఎన్నికలకు 30 రోజుల ముందు పొత్తులపై చంద్రబాబు కచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని లోకేష్ స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు