టీడీపి ఫ్లెక్సీపై జూ. ఎన్టీఆర్ ఫొటో: జగన్ పై విమర్శల జడివాన

By Nagaraju penumalaFirst Published Jun 3, 2019, 2:51 PM IST
Highlights

రాజోలు నియోజకవర్గం దిండి గ్రామంలో టీడీపీ వేయించిన ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏపీ ప్రజలు అభివృద్ధిని కోల్పోయారంటూ జగన్ అధికారంలోకి రావడాన్ని పరోక్షంగా విమర్శిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీపై అన్న నందమూరి తారకరామారావు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఫోటోలను ముద్రించారు.

రాజోలు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో అధికారం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం కూడా చేశారు. 

అభివృద్ధి నేపథ్యంలో అన్ని శాఖలపై రివ్యూలు చేస్తూ దూసుకుపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తెలుగుదేశం పార్టీ కాస్త సైలెంట్ గా ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరు నెలలపాటు జగన్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ఎలాంటి విమర్శలు చేయోద్దని సూచించడంతో తెలుగుదేశం పార్టీ నేతలు మౌనంగా ఉన్నారు. 

కానీ రాజోలు నియోజకవర్గం దిండి గ్రామంలో టీడీపీ వేయించిన ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏపీ ప్రజలు అభివృద్ధిని కోల్పోయారంటూ జగన్ అధికారంలోకి రావడాన్ని పరోక్షంగా విమర్శిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. 

ఫ్లెక్సీపై అన్న నందమూరి తారకరామారావు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఫోటోలను ముద్రించారు. అయితే పైన మాజీ లోక్ సభ స్పీకర్ దివంగత నేత జీఎంసీ బాలయోగి తనయుడు గంటి హరీష్ ఫోటోను కూడా ముద్రించారు. 

చివరన సినీనటుడు జూ.ఎన్టీఆర్ ఫోటోను ఫ్లెక్సీపై ముద్రించడం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీకి జూ. ఎన్టీఆరే దిక్కనా లేకపోతే జూ.ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాలనా అన్న చర్చ జోరుగా సాగుతోంది. 

click me!